క్షుద్ర‌పూజ‌ల కోసం న‌ర‌బ‌లా? బాలుడి కాళ్లూ, చేతులు న‌రికివేత‌!

కొద్దిరోజుల కింద‌ట అదృశ్య‌మైన ఓ బాలుడు అత్యంత దారుణంగా హ‌త్య‌కు గుర‌య్యాడు. కాళ్లూ, చేతులు న‌రికి వేసిన స్థితిలో ఆ బాలుడి మృత‌దేహం ల‌భించింది. క‌ర్ణాట‌క‌లోని బాగ‌ల్‌కోటె జిల్లా హున‌గుంద తాలూకాలోని కూడ‌లసంగ‌మ గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మృతుడి పేరు స‌తీష్ గిరియ‌ప్ప పూజారి. వ‌య‌స్సు 13 సంవ‌త్స‌రాలు.

ఈ నెల 13వ తేదీన ఆ బాలుడు అదృశ్యం అయ్యాడు. శుక్ర‌వారం సాయంత్రం ఆ బాలుడి మృత‌దేహం కూడ‌ల‌సంగ‌మ న‌ది ఒడ్డున చెట్ల పొద‌ల్లో క‌నిపించింది. మృత‌దేహం కుళ్లిపోయిన స్థితికి చేరింది. త‌ల స్థానంలో పుర్రె మిగిలి ఉంది. గొర్రెల కాప‌రులు ఈ మృత‌దేహాన్ని చూసి, హున‌గుంద పోలీసుల‌కు సమాచారం ఇచ్చారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మృత‌దేహం ఉన్న తీరును బ‌ట్టి చూస్తే.. క్షుద్ర‌పూజ‌ల‌కు బ‌లి ఇచ్చి ఉంటార‌నే అనుమానాలు త‌లెత్తుతున్నాయి. ఇంత దారుణంగా హ‌త్య చేయ‌డం.. కూడ‌ల‌సంగ‌మ‌లో భ‌యాందోళ‌న‌ల‌ను రేకెత్తించింది. 13 సంవ‌త్స‌రాల బాలుడిని ఇంత హింసించి ఎందుకు చంపి ఉంటార‌నే ప్ర‌శ్న అంద‌రినీ తొల‌చి వేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here