నాలుగు రోజుల కింద‌ట అదృశ్యమైంది..అట‌వీప్రాంతంలో మృత‌దేహంగా క‌నిపించింది!

ఆమె ఓ గాయ‌ని. పేరు మ‌మ‌త‌. జాన‌ప‌ద గీతాల‌ను ఆల‌పించ‌డంలో మంచి పేరు ఉంది. ఓ మ్యూజిక‌ల్ ప్రోగ్రామ్‌లో పాల్గొన‌డానికి వెళ్లిన ఆమె ఇక మ‌ళ్లీ వెన‌క్కి తిరిగి రాలేదు.

ఎక్క‌డికి వెళ్లిందో తెలియ‌దు. దీనిపై ఆమె కుమారుడు పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తుండ‌గానే.. ఆమె మృత‌దేహం రోహ్‌త‌క్ స‌మీపంలో అట‌వీ ప్రాంతంలో ల‌భించింది.

మొద‌ట గుర్తు తెలియ‌ని మృత‌దేహంగా కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. చివ‌రికి అది మ‌మ‌తదేన‌ని తేల్చారు. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఆమెను గొంతు కోసం హ‌త‌మార్చారు.

హ‌ర్యానాలోని కాలానౌర్‌కు చెందిన మ‌మ‌త జాన‌పద గాయ‌ని. పెళ్లిళ్లు, ఇత‌ర శుభ కార్యాల సంద‌ర్భంగా ఆమె పాడేవారు. ఆర్కెస్ట్రా ట్రూప్‌లో ఆమె స‌భ్యురాలు.

ఈ నెల 14వ తేదీన ఓ మ్యూజిక‌ల్ ప్రోగ్రామ్‌లో పాల్గొన‌డానికి వెళ్లారు. దీని త‌రువాత ఆమె వెనక్కి తిరిగి రాలేదు. అదృశ్యం అయ్యారు. దీనిపై ఈ నెల 16వ తేదీన ఆమె కుమారుడు కాలానౌర్ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు.

ఆదివారం ఉద‌యం ఆమె మోహిత్ అనే తోటి క‌ళాకారుడితో క‌లిసి నందీశాలాకు వెళ్లార‌ని ఆమె కుమారుడు భ‌ర‌త్ చెబుతున్నాడు.

మోహిత్‌తో పాటు వెళ్లిన కారులో మ‌రో ఇద్ద‌రు ఉన్నార‌ని, వారిని తాను ఎప్పుడూ చూడ‌లేద‌ని మ‌మ‌త త‌న‌కు ఫోన్ ద్వారా మెసేజ్ ఇచ్చిన‌ట్టు చెప్పాడు. దీన్ని పోలీసుల‌కు చూపించాడు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు వివిధ కోణాల్లో ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here