సెల్ఫీ కోసం మరీ ఇంత మూర్ఖంగా ప్రవర్తించాలా..!

సెల్ఫీల కోసం పాకులాడుతూ ఎంతోమంది ప్రాణాల మీదకు కొనితెచ్చుకుంటున్నారు. తాజాగా అలాంటిదే సోషల్ మీడియాలో ఓ వీడియో ప్రత్యక్షమైంది. రైల్వే ట్రాక్ వ‌ద్ద‌కు వ‌చ్చిన‌ శివ అనే యువకుడు త‌న సెల్‌ఫోన్‌లో సెల్ఫీ వీడియో తీసుకోవాల‌ని అనుకున్నాడు. త‌న‌ వెన‌క నుంచి ఎంఎంటీఎస్ ట్రైన్ వ‌స్తుండ‌గా దాన్ని ఓ చేతితో చూపిస్తూ పోజులిచ్చాడు. ఆ ట్రైన్ అత‌డి కుడి చేతికి, త‌ల‌కి బ‌లంగా తాకింది. గాయ‌ప‌డ్డ‌ ఆ యువ‌కుడిని గుర్తించిన రైల్వే సిబ్బంది ద‌గ్గ‌ర‌లోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అత‌డి ప్రాణాల‌కు ప్ర‌మాదం ఏమీ లేద‌ని వైద్యులు చెప్పారు. సెల్ఫీ కోసం ఇంత మూర్ఖంగా ప్రవర్తించాలా అని ఈ వీడియోను చూస్తే అర్థం అవుతుంది. ట్రైన్ కాస్త స్లోగా వస్తుండడంతో పెద్దగా ప్రమాదం ఏమీ జరగలేదు.

https://youtu.be/Fb7gYpbdOxw

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here