మోడీ జీ! న‌ర్మ‌ద అనుభ‌వాన్ని మ‌రిచిపోయారా?

చెన్నై: కావేరి న‌దీ జ‌లాల పంప‌కాల వ్య‌వ‌హారంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ రాజ‌కీయం చేస్తున్నార‌ని ప‌్ర‌ముఖ న‌టుడు, మ‌క్క‌ల్ నీధి మ‌య్య‌మ్ అధినేత క‌మ‌ల్ హాస‌న్ విమ‌ర్శించారు.

క‌ర్ణాట‌క‌-త‌మిళ‌నాడు మ‌ధ్య త‌లెత్తిన కావేరి న‌దీ జ‌లాల పంప‌కాల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డానికి నిర్వ‌హ‌ణ బోర్డును ఏర్పాటు చేస్తే.. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో బీజేపీకి ఓట్లు ప‌డ‌వ‌ని మోడీ భ‌య‌ప‌డుతున్నార‌ని ఘాటుగా విమ‌ర్శించారు. ఈ మేర‌కు క‌మ‌ల్ హాస‌న్ బ‌హిరంగ లేఖ రాశారు. ఓ వీడియోను కూడా విడుద‌ల చేశారు.

గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో న‌రేంద్ర‌మోడీ న‌ర్మ‌ద న‌దీ జ‌లాల పంప‌కాల స‌మ‌స్య‌ను ఎదుర్కొన్నార‌ని, ఇప్పుడాయ‌న దాన్ని విస్మ‌రించిన‌ట్టున్నార‌ని ఎద్దేవా చేశారు. న‌ర్మ‌ద న‌దీ జ‌లాల పంప‌కాల్లో త‌లెత్తిన వివాదాన్ని ప‌రిష్క‌రించ‌డానికి అప్ప‌ట్లో బోర్డును ఏర్పాటు చేశార‌ని క‌మ‌ల్ గుర్తు చేశారు.

అలాంటి చొర‌వ‌ను ఇప్పుడెందుకు చూప‌ట్లేద‌ని ప్ర‌శ్నించారు. క‌ర్ణాట‌క అసెంబ్లీకి వ‌చ్చేనెల ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయ‌ని, కావేరి బోర్డును ఏర్పాటు చేస్తే.. ఆ ఎన్నిక‌ల్లో ఓడిపోతామ‌నే భయంతోనే మోడీ వెనుకంజ వేస్తున్నార‌ని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here