మో సలా. పూర్తి పేరు మహ్మద్ సలా. ఈజిప్ట్‌కు చెందిన ఫుట్‌బాల్ స్టార్. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో జరిగిన ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌లో లివర్‌పూల్ తరఫున ఆడుతూ గాయపడ్డాడు. భుజానికి తీవ్ర గాయమైంది. ఫుట్‌బాల్ ప్రపంచకప్ పోటీల ముంగిట్లో ఈ ఘటన చోటు చేసుకోవడాన్ని మహ్మద్ సలా జీర్ణించుకోలేకపోతున్నాడు.
గాయం కారణంగా ఫుట్‌బాల్ ప్రపంచకప్ పోటీల నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఈ గాయంపై కారం పూసేలా మాట్లాడారు ఓ మత పెద్ద. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసాన్ని మధ్యలోనే విరమించుకోవడం వల్ల అల్లా తగిన శాస్తి చేశారంటూ కామెంట్స్ చేశారు. `రంజాన్ మాసంలో ఉపవాసాన్ని విరమించడం అతను చేసిన పెద్ద తప్పు. అందుకే అల్లా అతణ్ని శిక్షించాడు. ఈ శిక్షను అతను భరించి తీరాల్సిందే..` అని ముస్లిం మత పెద్ద ముబారక్ అల్-బతాలి వ్యాఖ్యానించారు.
అల్లా ప్రతి విషయాన్ని చూస్తూంటారని అన్నారు. లివర్‌పూల్ తరఫున ఆడుతుండటం వల్ల ఈ నెల 27వ తేదీన తన టీమ్‌తో పాటు మహ్మద్ సలా బ్రిటన్ నుంచి ఉక్రెయిన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా అతను తీవ్రంగా అలసిపోయాడు. పైగా అతను ఆడాల్సింది ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ మ్యాచ్.
అలసటకు గురైన సలా.. ఉపవాస దీక్షను మధ్యలోనే విరమించాడు. ఫిజియోథెరఫిస్ట్, న్యూట్రీషియనిస్ట్ చేసిన సూచనల మేరకు సలా.. ఉపవాస దీక్షను విరమించి ఆహారాన్ఇ స్వీకరించాడు. ఆ తరువాత జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సలా గాయపడ్డాడు. ఏకంగా ప్రపంచకప్ ఫుట్‌బాల్ పోటీల నుంచే వైదొలగాల్సి వచ్చింది.