సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌లో పెట్టి మాట్లాడొద్దంటే విన‌రే! మ‌రో ప్రాణం పోయింది!

భువ‌నేశ్వ‌ర్‌: సెల్‌ఫోన్ ఛార్జింగ్‌లో పెట్టిన స‌మ‌యంలో దాన్ని మ‌రిచిపోవ‌డ‌మే బెట‌ర్‌. ఛార్జింగ్‌లో పెట్టిన త‌రువాత కూడా మాట్లాడుతు, గేమ్స్ ఆడుతూ కూర్చుంటే.. ఫ‌లితాలు దారుణంగా ఉంటాయి. సెల్‌ఫోన్‌ను ఛార్జింగ్‌లో పెట్టి.. బాతాఖానీ వేసి కూర్చోవ‌డం ఎంత ప్ర‌మాద‌క‌ర‌మో తెలియ‌జేసే మ‌రో ఘ‌ట‌న ఇది.

 

ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని ఖేరియాక‌ని గ్రామానికి చెందిన ఉమా ఓర‌మ్ విద్యార్థిని. 19 సంవ‌త్స‌రాల ఉమా ఓర‌మ్ డిగ్రీ చ‌దువుతోంది. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం త‌న సెల్‌ఫోన్‌ను ఛార్జింగ్‌లో ఉంచిన కొద్దిసేప‌టి త‌రువాత ఫ్రెండ్‌కు ఫోన్ చేసి మాట్లాడుతూ కూర్చుంది. ఉన్న‌ట్టుండి పెద్ద శబ్దం చేస్తూ పేలిపోయిందా మొబైల్ హ్యాండ్‌సెట్‌.

ఈ ఘ‌ట‌న‌లో ఆమె ఛాతీ, చెయ్యి, కాళ్ల‌కు తీవ్రంగా కాలిన గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డిన ఉమా ఓర‌మ్‌ను ఝార్సుగూడ జిల్లా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ చికిత్స పొంఒదుతూ ఆమె మ‌ర‌ణించింది. ఈ ఘ‌ట‌న‌పై లైకెరా పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here