బీజేపీ మొదలుపెట్టిన విగ్రహాల ధ్వంసం చివరికి వారి దాకా వచ్చింది.. మోడీ విగ్రహం ధ్వంసం..!

గత కొద్ది రోజులుగా భారతదేశంలో విగ్రహాల ధ్వంసం చేసే సంస్కృతి మొదలైన సంగతి తెలిసిందే.. త్రిపురలో లెనిన్ విగ్రహాన్ని కూల్చేసి కొత్త సమస్యలకు నాంది పలికింది బీజేపీ..! ఆ తర్వాత పలు రాష్ట్రాలలో విగ్రహాల ధ్వంసం జరుగుతూ వెళ్ళింది. నాలుగు రోజుల వ్యవధిలో లెనిన్, పెరియార్ రామస్వామి, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, బీఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీల విగ్రహాలు ధ్వంసం చేశారు. ఇప్పుడు ఏకంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు.

ఉత్తరప్రదేశ్ లోని కౌషంబీ జిల్లా భగవాన్ పూర్ లో మోడీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ గ్రామంలో 2014లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీజేపీ నేత బ్రజేంద్ర నారాయణ్ మిశ్రా ఈ విగ్రహాన్ని ఓ శివాలయంలో ఏర్పాటు చేశారు. అప్పుడప్పుడు గ్రామస్థులు పూజలు కూడా చేస్తుండేవారు. ఈ విగ్రహం ముక్కును ధ్వంసం చేశారని తెలియడంతో స్థానికులు పెద్దఎత్తున అక్కడికి వచ్చి తమ నిరసన తెలిపారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశామని, దర్యాఫ్తు చేస్తున్నామని తెలియజేశారు.

Image result for narendra modi statue

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here