ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ఇలా జరగబోతోంది.. ఓ టీమ్ కెప్టెన్ పేరు టీవీలో చెప్పనున్నారు..!

ఐపీఎల్ 2018 అతి త్వరలో జరగబోతోంది. ఇప్పటికే చాలా టీమ్స్ తమ జట్టు కెప్టెన్ ఎవరో చెప్పేశారు. కానీ కొన్ని టీమ్స్ మాత్రం తమ జట్టు కెప్టెన్ ఎవరా..? అన్న విషయంలో క్లారిటీ లేవు. రాజస్థాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్లు వారి జట్ల కెప్టెన్ ఎవరో ఇంకా బయటపెట్టలేదు. ఇందులో రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ ఎవరో ఈరోజు రాత్రి బయటకు రానుంది. అది కూడా ఇప్పటిదాకా ఐపీఎల్ చరిత్రలో జరగని విధంగా..!

రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ పేరు ఫిబ్రవరి 24న టీవీ ప్రోగ్రాంలో బయట పెట్టనున్నారు. తొలిసారి అలా కెప్టెన్ పేరును టీవీ ప్రోగ్రాంలో వెల్లడించనున్నారు. ఐపీఎల్ మొదటి అంచె విజేత అయిన రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ కెప్టెన్ పేరును శనివారం రాత్రి స్టార్ స్పోర్ట్స్ ఛానల్ లో బయటపెట్టనుంది. రాజస్థాన్ రాయల్స్ మాజీ ఆటగాడు అయిన మొహమ్మద్ కైఫ్ పేరును వెల్లడించనున్నాడు. రాజస్థాన్ రాయల్స్ రెండు సంవత్సరాల నిషేధం అనంతరం ఐపీఎల్ లో అడుగుపెట్టింది.

ఇక కెప్టెన్సీ రేసులో స్టీవ్ స్మిత్, అజింక్య రహానే, బెన్ స్టోక్స్ ముందున్నారు. రహానే, స్మిత్ లలో ఎవరో ఒకరికి కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉన్నాయని అంటున్నారు. ఏప్రిల్ 6 న ఐపీఎల్ 11వ సీజన్ ప్రారంభం కానుంది. మొత్తం ఎనిమిది జట్లు పాల్గొనబోతున్నాయి. రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తిరిగి టోర్నమెంట్ లోకి అడుగుపెట్టగా గుజరాత్ లయన్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ టీమ్ లను రద్దు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here