తన భార్యకు ముందే పెళ్ళి అయిందని తెలియదట.. తెలిసాక కూడా ఏమనలేదు షమీ.. కానీ ఇప్పుడు..!

మొహమ్మద్ షమీ గురించి అతడి భార్య హసిన్ జహాన్ చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం అయ్యాయి.. అతడిపై ఆమె చేసిన వ్యాఖ్యలలో నిజా నిజాలేమిటో ఇంకా స్పష్టం కాలేదు. అయితే షమీకి చాలా మంది మద్దతు పలికారు. అంతేకాకుండా ఆమె చేసిన ఆరోపణల్లో కొన్ని నిజాలు కావని ఇప్పటికే తేలిపోయింది.

అయితే ఇప్పుడు షమీ తన భార్య గురించి చాలా విషయాలు చెప్పుకొస్తున్నాడు. షమీని పెళ్ళి చేసుకోకముందే ఆమెకు వేరే వ్యక్తితో పెళ్ళి అయిందట. ఆ విషయాన్ని షమీకి చెప్పకుండా దాచారట. హసీన్‌కి గతంలో వివాహమైన విషయం పెళ్లికి ముందు నాకు తెలియదు. ఇద్దరు కూతుళ్లని తన అక్క పిల్లలుగా నాకు పరిచయం చేసింది. ఆ తర్వాత హసీన్ మొదటి వివాహం గురించి నాకు తెలిసింది. అయినప్పటికీ తనని నేను చాలా బాగా చూసుకున్నా. కానీ.. తనెప్పుడూ అభద్రతాభావంలోనే ఉండేది. ఆమె నాపై చేసిన ఫిక్సింగ్ ఆరోపణల్లో వాస్తవాలు లేవు. ఇంత గొడవ జరిగినా.. ఇప్పటికీ ఆమెతో నేను రాజీపడేందుకు సిద్ధంగానే ఉన్నానని మహ్మద్ షమీ వెల్లడించాడు. తాను ఫిక్సింగ్‌కి పాల్పడలేదని.. ఒకవేళ నేరానికి పాల్పడినట్లు తేలితే ఉరిశిక్షకైనా తాను సిద్ధమని ఉద్వేగంగా మాట్లాడాడు షమీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here