షమీ భార్యకు నెలకు 10 లక్షల రూపాయలు భరణంగా కావాలట..!

భారత క్రికెటర్ షమీ.. అతని భార్య హసిన్ జహాన్ మధ్య కొద్ది రోజుల నుండి గొడవలు జరుగుతూ ఉన్నాయి. షమీ తనను మోసం చేశాడని ఆమె మీడియాకు సాక్ష్యాలు కూడా చూపించింది. అలాగే పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. తాజాగా ఆమె భరణం కావాలని తన పిటీషన్ లో పేర్కొంది. నెలకు 10 లక్షల రూపాయలు తన నిర్వహణ ఖర్చుల కోసం ఇవ్వాలని ఆమె చెప్పింది. కుటుంబ పోషణ చూసుకోవాల్సిన బాధ్యత షమీపై ఉందని.. హసిన్ కు రూ.7 లక్షలు, కుమార్తెకు రూ.3 లక్షల చొప్పున ప్రతీ నెలా ఇప్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టులో ఆమె తరపు లాయర్లు పిటీషన్ వేశారు.


పశ్చిమబెంగాల్ లోని అలిపోర్ జ్యుడీషియల్ మేజిస్ట్రట్ కోర్టులో షమీకి వ్యతిరేకంగా హసిన్ గృహ హింస నిరోధక చట్టం కింద దాఖలు చేసిన పిటిషన్ విచారణలో ఉంది. ఇదే కోర్టులో ఆమె తాజాగా భరణం కోరుతూ మరో పిటిషన్ వేశారు. ‘‘నేను నష్టపోయాను. ఢిల్లీకి వచ్చి షమీ కోసం ఏడు రోజులు వేచి చూశా. కానీ, అతడు నా పట్ల ప్రవర్తించిన విధానాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. తను నా కుమార్తెను ఒక్కసారే కలిశాడు. అతడు ఎటువంటి బాధ్యతలు తీసుకోనేందుకు ముందుకు రాకపోవడంతో నాకు మెయింటెనెన్స్ ఇప్పించాలి’’ అని ఆమె కోరారు. ఏటా రూ.100 కోట్లు సంపాదిస్తున్న షమీ నెలకు రూ.10 లక్షలు ఇవ్వడం భారం కాబోదన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here