ఒకప్పుడు సూసైడ్ చేసుకోవాలని అనుకున్న షమీ.. భార్య మానసిక స్థితిపై అనుమానం వ్యక్తం..!

రెండు రోజులుగా భారత క్రికెటర్ మొహమ్మద్ షమీ గురించి మీడియాలో తీవ్రంగా చర్చించుకుంటూ ఉన్నారు. షమీ భార్యను మోసం చేసి.. వేరే అమ్మాయితో గడిపాడని అభియోగాలు నమోదయ్యాయి. ముఖ్యంగా అతడి భార్య ఈ విషయాలను బయటపెట్టడంతో షమీ చుట్టూ నీలినీడలు అలుముకున్నాయి. తాజాగా షమీ భార్య షహీన్ జహాన్ మరిన్ని ఆరోపణలు చేసింది. షమీ ఒకప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడని.. అంతేకాకుండా భార్యనే మోసం చేసినోడు.. దేశాన్ని కూడా మోసం చేసే అవకాశం ఉందని చెప్పింది. ఇక షమీ మాత్రం హసీన్‌ వ్యాఖ్యలు చూస్తుంటే ఆమెకు పిచ్చి పట్టినట్టు అనిపిస్తోందని పేర్కొన్నాడు. ఆమె చుట్టూ ఉన్నవాళ్లు చేసిన కుట్ర ఇదని అంటున్నాడు.

తాము 2012లో మొదటిసారి కలుసుకున్నామని, అయితే, అంతకుముందే షమీ తన సమీప బంధువుల్లో ఒక అమ్మాయితో ప్రేమాయణం కొనసాగించాడని తెలిపింది. ఆ అమ్మాయి కుటుంబసభ్యులు షమితో పెళ్లికి ఒప్పుకోకపోవడంతో, మనస్తాపానికి గురైన షమీ ఆత్మహత్యాయత్నం కూడా చేశాడని ఆమె చెప్పింది. షమి కోసం తాను తనకు ఇష్టమైన మోడలింగ్‌ కెరీర్ వదులుకున్నానని తెలిపింది.

పాకిస్థాన్ మహిళ నుంచి డబ్బులు స్వీకరించానన్న తన భార్య ఆరోపణలను టీమిండియా పేసర్ మహ్మద్ షమీ ఖండించాడు. తాను ఫిక్సింగ్ చేయలేదని, ఎవరి నుంచీ డబ్బులు తీసుకోలేదని అన్నాడు. ఇంత తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న ఆమె మానసిక స్థితిపై అనుమానం వ్యక్తం చేశాడు. తాను తన భార్యతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కుదరడం లేదని, ఆమె చుట్టూ ఉన్నవాళ్లు చేసిన కుట్ర ఇదని, ఇంత తీవ్రమైన అభియోగాలు ఇప్పుడే ఎందుకు మోపుతోందో తనకు అర్థం కావడం లేదని షమీ పేర్కొన్నాడు. తనపై ఆమె చేసిన ఫిక్సింగ్‌ ఆరోపణలు దారుణమని, వాటిని ఆమె నిరూపించాల్సిన అవసరం ఉందని తెలిపాడు.

‘Mohd Shami Assaulted & Cheated On Me’, Claims Wife Hasin Jahan

"Mohammed Shami has assaulted me and is a big flirt," says the fast bowler's wife Hasin Jahan.

The Quintさんの投稿 2018年3月7日(水)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here