షమీ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడలేదు.. ఏది పడితే ఆ మాట అనకూడదు షమీ భార్య గారూ..!

టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీపై మ్యాచ్ ఫికింగ్స్ ఆరోపణలు నిజం కాదని బీసీసీఐ తేల్చింది. షమీ భార్య హసీన్ జహాన్ తన భర్త గురించి ఆరోపణలు చేసే సమయంలో షమీ మ్యాచ్ ఫిక్సర్ అంటూ కామెంట్లు చేసింది. దీనిని సీరియస్ గా పరిగణించిన బీసీసీఐ విచారణ చేపట్టింది. ఆ విచారణలో షమీకి క్లీన్ చిట్ ఇచ్చేసింది. షమీ ఎటువంటి మ్యాచ్ ఫిక్సింగ్ కూ పాల్పడలేదని తెలిపింది బీసీసీఐ. అలాగే షమీ బీ గ్రేడ్ వార్షిక ఒప్పందం కూడా కొనసాగించనున్నట్లు బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ విభాగం చీఫ్ నీరజ్ కుమార్ తెలిపారు.

షమీ, అతడి కుటుంబం వేధింపులకు గురి చేశాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా ఆయనపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కూడా చేసింది. భార్యనే మోసం చేసినవాడు.. దేశాన్ని ఎందుకు మోసం చేయడని పెద్ద పెద్ద డైలాగులు కొట్టింది కూడా.. దీంతో షమీని బీసీసీఐ నేతృత్వంలోని అవినీతి నిరోధక విభాగం ప్రశ్నించి, ఈ కేసును దర్యాప్తు చేసింది. చివరకు షమీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడలేదని గుర్తించింది. దీనిపై సోషల్ మీడియాలో చాలా కామెంట్లు వినపడుతూ ఉన్నాయి. ఏది పడితే ఆ కామెంట్లు చేయకండి షమీ భార్య గారూ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. షమీతో మీకు ఉన్నది పర్సనల్ గొడవ అని.. దాన్ని క్రికెట్ కు అంటించకండి అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here