మంచు లక్ష్మీ మీద వస్తున్న కామెడీ వీడియోలపై స్పందించిన మోహన్ బాబు..!

మోహన్ బాబు చాలా రోజుల తర్వాత హీరోగా చేసిన సినిమా గాయత్రి.. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆయన పలువురికి ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. అయితే ఓ ఇంటర్వ్యూలో ఆయన్ను మంచు లక్ష్మి భాష గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

తాను సినిమాల్లోకి వచ్చిన సమయంలో రాయలసీమ వాసివి నీకు తెలుగు సరిగా పలకడం రాదని అనే వాళ్ళని ఆయన అన్నారు. ఆ తర్వాత తన డైలాగ్ లు ఎంత పాపులర్ అయ్యారో తెలుగు ప్రజలు అందరికీ తెలుసునని ఆయన చెప్పుకొచ్చారు. ఇక తన కూతురు లక్ష్మీకి ఆంగ్లం మీద బాగా పట్టు ఉందని తనకు తెలుసునని ఆయన అన్నారు. తన పిల్లలకు సెపరేట్ గా ట్యూషన్ పెట్టించి మరీ ఇంగ్లీష్ నేర్పించానని.. ఆ తర్వాత అమెరికాకు కూడా వాళ్ళను పంపానని.. తన కొడుకులు ఇద్దరూ ఇంగ్లీష్ ను అంత గొప్పగా నేర్చుకోలేకపోయారని.. కానీ మంచు లక్ష్మి మాత్రం అద్భుతంగా మాట్లాడగలుగుతుందని చెప్పారు. మంచు లక్ష్మిని మనం మెచ్చుకోవాలని ఆయన అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here