గాయత్రి సినిమాలో డైలాగ్స్ చంద్రబాబు మీదనే.. నారా లోకేష్ మీద కూడా డైలాగ్..!

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఫుల్ లెంత్ హీరోగా సినిమా చేసి చాలా రోజులైంది. తాజాగా గాయత్రి సినిమాతో ఆయన ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమాలో మోహన్ బాబు నటన చాలా బాగుందని.. డైలాగ్స్ బాగా పేలాయని అంటున్నారు. అయితే సినిమాలోని డైలాగ్స్ చాలా వరకూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును.. టీడీపీ నాయకులను టార్గెట్ చేసినట్లు అనిపిస్తుంది.

ఒక సీన్లో మోహన్ బాబు.. ‘‘ఒకడేమో బీకాంలో ఫిజిక్స్ చదివానంటాడు.. ఇంకొకడేమో నా పింఛను తీసుకుంటున్నావ్.. నా రోడ్ల మీద నడుస్తున్నావ్.. నాకే ఓటేయాలంటాడు. ఇంకొకడేమో సార్వభౌమాధికారం అని పలకలేక బౌబౌ అంటాడు’’ అంటూ డైలాగ్ పేల్చాడు. బీకాంలో ఫిజిక్స్ అని ఎవరు చెప్పారో అందరికీ తెలిసిందే..! ఒకానొక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేను ఇస్తున్న పించన్లు తీసుకుంటూ ఎందుకు ఓటు వేయరు అని ప్రశ్నించారు కూడా..! ఇక చివరిగా చినబాబు మంత్రి లోకేష్ ఒక సందర్భంలో సార్వభౌమాధికారం అని పలుకలేకపోయారు. దాన్ని దృష్టిలో పెట్టుకొనే ఈ సినిమాలో డైలాగ్స్ పెట్టారని ప్రతి ఒక్కరూ అంటున్నారు. ఇక సినిమాలో స్పెషల్ స్టేటస్ మీద చేసిన వ్యాఖ్యలకు ‘బీప్’ ఉపయోగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here