వారు.. నీచులు.. నికృష్ఠులు..నాశనమైపోతారన్న మోహన్ బాబు.. ఇంతకూ ఎవరిని..?

పైరసీ భూతంపై కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఘాటుగా స్పందించారు. పైరసీకి పాల్పడ్డవారికి కూడా కుటుంబం ఉంటుందని పైరసీ చేసిన పాపానికి వారు నాశనమైపోతారని ఆయన అన్నారు. పైరసీని చూసిన వారు కూడా నీచాతినీచులని ఆయన వ్యాఖ్యలు చేశారు. గాయత్రి సక్సెస్ మీట్ సందర్భంగా మోహన్ బాబు ఈ అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఓ చిత్ర నిర్మాతగా పైరసీ విషయంలో తన హృదయం ఏడుస్తోందని నిర్మాత కష్టసుఖాలు జర్నలిస్టులకు ప్రజలకు తెలుసని అన్నారు. నిర్మాతగా – నటుడిగా గాయత్రి సినిమా కోసం 9 నెలలు కష్టపడ్డానని చేయి ఆపరేషన్ మరో ఆపరేషన్ జరిగినప్పటికీ వయసును కూడా లెక్కచేయకుండా రిస్కీ ఫైట్స్ చేశానన్నారు. పైరసీ చేసే వారిని దొంగలారా… నీచురాలా, పోరంబోకులారా, దుర్మార్గులారా అని నోటిని అపవిత్రం చేసుకోకూడదన్నారు. దుర్మార్గుడిగా పైరసీ చేసేవాడిగా బ్రతకమని ఏ తల్లీ చెప్పదన్నారు. నీచాతి నీచంగా డీవీడీలు ఆన్ లైన్ పైరసీ ప్రింట్ లు చూడొద్దని ప్రేక్షకులకు హితవు పలికారు. పైరసీ అనేది నీచమైన పని అని.. తెలియని శక్తి వాళ్లను నాశనం చేస్తుందని తిట్టిపోశారు. దయచేసి ఎవరూ పైరసీని చూడొద్దని విన్నవించుకున్నారు. పైరసీ చేసినోళ్లు, చూసినోళ్లు నికృష్ఠులు అన్నారు. అలాంటి వారిని తెలియని శక్తి.. నాశనం చేస్తుందని శపించారు. దయచేసి ఎవరూ పైరసీ చూడొద్దని రిక్వెస్ట్ చేశారు. ఎంతో కష్టపడి సినిమా చేశామని.. పైరసీ వల్ల సినీ ఇండస్ట్రీ అంతా నాశనం అవుతుందన్నారు. గాయత్రి సినిమాకు సంబంధించి పైరసీ ప్రింట్ పలు ఆన్ లైన్ వెబ్ సైట్లలో ప్రత్యక్షమైంది. ఇక పలు సీన్లు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here