కాంగ్రెస్ నేత చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం అరెస్ట్..!

కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంను సీబీఐ అరెస్ట్ చేసింది. ఫెమా నిబంధనల్ని ఉల్లంఘించారనే కారణంతో మనీలాండరింగ్ కేసులో మంగళవారం రాత్రి చెన్నైలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఐఎన్‌ఎక్స్ మీడియా పెట్టుబడుల్లో అవకతవకాలు జరిగాయని గత ఏడాది మే నెలలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్తీ చిదంబరంపై కేసు నమోదు చేసింది. చిదంబరం కేంద్ర మంత్రిగా ఉండగా.. 2007లో ఐఎన్‌ఎక్స్ మీడియాలో రూ. 300 కోట్ల మేర విదేశీ పెట్టుబడుల విషయంలో నిబంధనల్ని ఉల్లంఘించారని ఈడీ అనుమానిస్తోంది.

బుధవారం సాయంత్రంలోగా విచారణ నిమిత్తం కార్తీ చిదంబరంను ఢిల్లీ తీసుకెళ్లనున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులోనే సీబీఐ అధికారులు కార్తీ చిదంబరాన్ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో చార్టెర్డ్ అకౌంటెంట్‌‌ను కూడా సీబీఐ అధికారులు సోమవారం అరెస్ట్ చేయశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here