కోతికి అమ్మాయి లాగా డ్రెస్ వేయించి..!

ఈ మధ్య ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తోంది. అదేమిటంటే ఓ కోతి చిన్న పాప లాగ డ్రెస్ వేసుకొని దారిన వెళుతున్న వారి దగ్గర నుండి డబ్బులు తీసుకుంటూ కనిపిస్తోంది. ఈ ఘటన ఎక్కడ చోటుచేసుకుందబ్బా అని అందరూ ఆరాతీస్తున్నారు. అయితే ఇది ఇండోనేషియా లోని బోగోర్ పట్టణంలో జరిగినది.

పోనీ టెయిల్ వేసుకున్న అమ్మాయి లాగా వేసిన డ్రెస్ తో కోతి అందరినీ ఆకర్షించింది. దూరం నుండి చూసే వాళ్లకు చాలా మందికి చిన్న పాప లాగే కనిపిస్తుంది. కానీ దగ్గరకు వచ్చిన తర్వాత కోతి తోక కనిపించింది. చేతుల్లో బ్లూ కలర్ బకెట్ పట్టుకుని రోడ్డు మీద ఉన్న డ్రైవర్లు ఎవరైనా డబ్బులు ఇస్తారా అని కోతి ఎదురుచూస్తూ కనిపించింది. కొందరు డబ్బులు ఇవ్వగానే..దాన్ని తీసుకొని బకెట్ లో వేసేసుకుంది. ఈ వీడియో కొన్ని గంటల్లోనే వైరల్ అయింది. కొందరు కోతి బాగా చేసింది అని నవ్వుకుంటూ ఉండగా మరికొందరు పాపం కోతి అని అంటూ ఉన్నారు. ఎందుకంటే ఇలా చేయడానికి వారు కోతులను ఎంతగానో హింసిస్తారట.. మనుషులను ఆనందంగా ఉంచేందుకు పాపం ఈ మూగజీవాలకు చిత్ర హింసలు పెడతారు. అంతేకాకుండా వాటికి సైకిల్ తొక్కించడాలు.. అన్నీ నేర్పించి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. 2013లో మూగజీవాలను హింసిస్తున్నారని జంతు ప్రేమికులు ఫిర్యాదు చేయడంతో దీన్ని నిషేధించారు. ఇండోనేషియా రాజధాని జకార్తాలో వీటిపై నిషేధం విధించాక కోతుల ట్రైనింగ్ మీద ఆధారపడి డబ్బులు సంపాదిస్తున్నవాళ్ళు ఒక్కొక్కరు.. ఒక్కో ప్రాంతానికి వెళ్ళారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here