నీటి కోసం బావిలో దిగి.. బ‌య‌టికి రాలేక‌!

కార్వార‌: వేస‌వి దాహార్తి మూగ‌జీవుల ప్రాణాల‌ను తోడేస్తోంది. ఎక్క‌డ నీరు దొరికితే అక్క‌డ దూకేస్తున్నాయవి. ఇలా కొత్త‌గా త‌వ్విన ఓ బావిలోకి దూకిన కొన్ని కొండ‌ముచ్చులు.. బ‌య‌టికి రాలేక ఇబ్బందుల పాల‌య్యాయి. వాటి అవ‌స్థ‌ల‌ను గ‌మ‌నించిన ఆ బావి య‌జమాని కొండ‌ముచ్చుల‌ను ప్రొక్లోయిన‌ర్ స‌హాయంతో బ‌య‌టికి తీయించాడు.

క‌ర్ణాట‌క‌లోని ఉత్త‌ర క‌న్న‌డ జిల్లా కుమ‌టా తాలూకా ప‌రిధిలోని త‌ల‌గెరెలో చోటు చేసుకుంది. వీజీ హెగ్డే అనే రైతు త‌న పొలంలో కొత్త‌గా బావిని త‌వ్వించాడు. బావిలో కొన్ని నీళ్లు ఊరాయి. ద‌ప్పిక తీర్చుకోవ‌డానికి కొన్ని కొండ‌ముచ్చులు నీట ఆ బావిలో దూకాయి. ఆ త‌రువాత బ‌య‌టికి రాలేక అవ‌స్థ‌లు ప‌డ్డాయి.

కోతులు, పైగా కొండముచ్చులు బావిలో నుంచి బ‌య‌టికి రాలేక‌పోవ‌డ‌మేంట‌నే అనుమానం రావ‌చ్చు. జేసీబీ పెట్టి త‌వ్వించ‌డంతో నున్న‌గా త‌యార‌య్యాయి దాని గోడులు. దీనితో స‌రైన ప‌ట్టు చిక్క‌క కోతులు బ‌య‌టికి రాలేక‌పోయాయి. దీన్ని గ‌మ‌నించిన వీజీ హెగ్డే.. అదే జేసీబీతో కోతుల‌ను బ‌య‌టికి తీసుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here