ప్రేమికుల‌పై దౌర్జ‌న్యం: యువ‌కుల దుస్తులు విప్పించి..!

మ‌డికెరి: మోర‌ల్ పోలీసింగ్ వెర్రి త‌ల‌లు వేస్తోంద‌న‌డానికి తాజా ఉదాహ‌ర‌ణ‌గా ఈ ఘ‌ట‌న గురించి చెప్పుకోవ‌చ్చు. బైక్‌పై వెళ్తోన్న ఇద్ద‌రు యువ‌కులు, ఇద్ద‌రు అమ్మాయిల‌ను అడ్డుకున్న కొంద‌రు వ్య‌క్తులు వారిపై దాడికి దిగారు. యువ‌కుల దుస్తులు విప్పించి, కొట్టారు. అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించారు.

ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని కొడ‌గు జిల్లా మ‌డికెరి తాలూకాలోని కూరంగాల గ్రామంలో చోటు చేసుకుంది. రెండు రోజుల కింద‌ట చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ఒక‌టి సోషల్ మీడియాలో వైర‌ల్‌లా మారింది.

జిల్లాలోని భాగ‌మండ‌ల స‌మీపంలో ప్ర‌వ‌హించే కావేరి న‌ది ప‌రీవాహ‌క ప్రాంతానికి వ‌చ్చిన ఇద్ద‌రు యువ‌కులు, ఇద్ద‌రు అమ్మాయిలపై స్థానికులు దౌర్జన్యం చేశారు. బాధితులు త‌మ‌ది కూడా ప‌క్క ఊరేన‌ని చెబుతున్న‌ప్ప‌టికీ.. వారు వినిపించుకోలేదు.

తాము ఇంజినీరింగ్ విద్యార్థుల‌మ‌ని చెప్పిన ప‌ట్టించుకోలేదు. యువ‌కుల దుస్తులు విప్పించారు. వారిని భాగ‌మండ‌ల పోలీసుల‌కు అప్ప‌గించారు. స్థానికులు త‌మ‌పై దాడి చేసిన‌ట్లు బాధితులు అదే పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. దీనితో రంగంలోకి దిగిన పోలీసులు రెండు వ‌ర్గాల మ‌ధ్య పోలీసులు రాజీ కుదిర్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here