మోర్గాన్ ఫ్రీమాన్ అంత శాడిస్టా?

మోర్గాన్ ఫ్రీమాన్‌. హాలీవుడ్ సినిమాలు చూసే ప్రేక్ష‌కుల‌కు చిర ప‌రిచితమైన పేరు ఇది. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకున్న మోర్గాన్ ఫ్రీమాన్‌పై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. ఒక‌రు కాదు, ఇద్ద‌రు కాదు ఎనిమిది మంది మ‌హిళ‌లు ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు గుప్పించారు.

త‌మ‌కు లైంగికంగా వేధించారంటూ మీడియాకు ఎక్కారు. మోర్గాన్ ఫ్రీమాన్ మీద ఆరోప‌ణ‌లు చేసిన వారంద‌రూ టెక్నీషియ‌న్లు. సినిమా షూటింగ్ సంద‌ర్భంగా త‌మ‌ను క్యాబిన్‌కు పిలిపించుకుని, లైంగిక వేధింపుల‌కు గురి చేసేవాడ‌ని బాధితులు పేర్కొన్న‌ట్టు సీఎన్ఎన్ ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది.

త‌మ ఒంటిపై ఎక్క‌డెక్క‌డో చేతులు వేసేవాడ‌ని, తాక‌రాని చోట తాకేవాడ‌ని చెప్పారు. సెట్స్‌లో బ‌హిరంగంగానే, అంద‌రిముందూ త‌మ స్క‌ర్ట్‌ల‌ను ఎత్తేవాడ‌ని, శాడిస్ట్‌లా ప్ర‌వ‌ర్తించేవాడ‌ని చెబుతున్నారు. 1980లో బ్రుబాక‌ర్ సినిమా ద్వారా హాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైన మోర్గాన్ ఫ్రీమాన్ ప‌లు హిట్ సినిమాల్లో న‌టించారు.

బ్రూస్ ఆల్‌మైటీ, మిలియ‌న్ డాల‌ర్ బేబీ, బ్యాట్‌మ‌న్ బిగిన్స్‌, ద డార్క్ నైట్స్‌, ఒబ్లివియ‌న్‌, హై క్రైమ్స్‌, లండ‌న్ హ్యాస్ ఫాలెన్‌.. వంటి సినిమాల్లో న‌టించారు. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌య‌స్సు 80 సంవ‌త్స‌రాలు. అయిన‌ప్ప‌టికీ.. విరామం లేకుండా సినిమాలు చేస్తున్నారు. ఆయ‌న న‌టించిన తాజా చిత్రం ఏంజెల్ హ్యాజ్ ఫాలెన్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here