గంటలు, రోజులు, వారాలు కాదు.. డిసెంబర్ లో మాస్కోలో ఎంతసేపు సూర్యుడు కనిపించాడో తెలుసా..?

సాధారణంగా మనం ఒక్క గంట సూర్యుడు లేటుగా కనిపిస్తేనే చలికి అల్లాడిపోతున్నాంరా బాబూ.. సూర్యుడు ఏమైపోయాడో అని అనుకుంటూ ఉంటాం. మరి కొన్ని దేశాల్లో అయితే నెలల తరబడి సూర్యుడు కనిపించడు. దానికి ఎవరికి చెప్పుకోవాలి. రష్యాలోని మాస్కో నగరం సరికొత్త చరిత్ర సృష్టించిది తెలుసా..?

2017 డిసెంబర్ నెలలో మాస్కోలో కేవలం 10 నిమిషాలు కూడా సూర్యుడు కనిపించలేదట. సాధారణంగా మాస్కో నగరంలో సగటున 18 గంటల పాటూ సూర్యుడు కనిపిస్తూ ఉంటాడు. కానీ విపరీతమైన చలి, మేఘాల కారణంగా మాస్కో నగరాన్ని చీకటి కమ్ముకుంది. కేవలం ఆరు నుండి ఏడు నిమిషాల పాటూ గత డిసెంబర్ లో సూర్య రష్మి మాస్కో నగరంపై పడింది.

ఇది పర్యావరణానికి మనిషి చేస్తున్న హానికి సాక్ష్యాలని అంటున్నారు. ఇప్పటికే ప్రకృతి తన కోపాన్ని జనాలపై చూపిస్తోందని. మరికొద్ది సంవత్సారాలు పోతే మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక రష్యాలోని కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఏకంగా -67 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2000 సంవత్సరంలో డిసెంబర్ నెలలో మూడు గంటల పాటు సూర్యుడు కనిపించాడని.. ఆ తర్వాత ఇదే దారుణమని కేవలం ఆరు నిమిషాల పాటు సూర్యుడు కనిపించడం అంటే వాతావరణంలో ఎంత మార్పులు వస్తున్నాయో అర్థం చేసుకోవచ్చని పర్యావరణవేత్తలు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here