తుపాకి గురి పెట్టి, మైన‌ర్‌ను పెళ్లాడిన గ్యాంగ్‌స్ట‌ర్‌

పాట్నా: క‌ర‌డ‌గుట్టిన నేర‌స్తుడు ప‌ప్పు యాద‌వ్‌.. మైన‌ర్ బాలిక‌ను పెళ్లి చేసుకున్నాడా? అంటే అవున‌నే చెబుతోంది ఈ పిక్‌. మైన‌ర్ బాలిక‌ను అప‌హ‌రించి, ఆమె నుదుట‌న బ‌ల‌వంతంగా కుంకుమను దిద్దుతున్న ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘ‌ట‌న ఎప్పుడు చోటు చేసుకున్న‌దో తెలియ‌రావ‌ట్లేదు. బిహార్‌లోని స‌న్హోలా గ్రామంలో ఈ ఘ‌ట‌న సంభవించిన‌ట్లుగా చెబుతున్నారు.

మైన‌ర్ బాలిక నేల‌పై కూర్చుని ఉండ‌గా.. ఆమె మెడ‌లో వేసిన కాషాయ‌రంగు చున్నీని పసుపురంగుతో ఉన్న వ‌స్త్రానికి ముడి వేసి ఉండ‌టం, ఆమె ప‌క్క‌నే ఓ వ్య‌క్తి ఓ చేత్తో తుపాకి, ఇంకో చేత్తో టార్చిలైట్‌ను ప‌ట్టుకుని క‌నిపిస్తున్నాడు. మైన‌ర్ బాలిక‌ను చంపేస్తామ‌ని బెదిరించి, బ‌ల‌వంతంగా పెళ్లి చేసుకున్న‌ట్లు అనుమానిస్తున్నారు. ఈ ఫొటోలో ఉన్న వ్య‌క్తుల కోసం పోలీసులు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here