నేషనల్ ప్లేయర్ నుండి గ్యాంగ్ స్టర్ అయ్యాడు.. మర్డర్ చేశాక డ్యాన్స్ చేసేవాడట.. అలాంటి వ్యక్తిని..!

పంజాబ్ కు చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ విక్కీ గౌండర్ ను పంజాబ్ పోలీసులు ఎంకౌంటర్ లో హతమార్చారు. రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఎన్ కౌంటర్ నిర్వహించారు. ఈ ఎన్ కౌంటర్ లో అతని ప్రధాన అనుచరుడు, నభా జైలు దాడి సూత్రధారి ప్రేమ లహోరియా కూడా ప్రాణాలు కోల్పోయాడు.

విక్కీ గౌండర్ అలియాస్ జిందర్ అసలు పేరు హర్జీందర్ భుల్లార్. చిన్న తనం నుంచే నేర ప్రవృత్తిని అలవరుచుకున్నాడు. గ్యాంగ్ స్టర్ గా ఎదిగాడు. సుపారీలు తీసుకుని హత్యలకు పాల్పడటం, ఆయుధాల అక్రమ రవాణా, ఉగ్రవాదులకు సాయంలాంటి ఎన్నో విద్రోహక చర్యలకు పాల్పడ్డాడు. విక్కీకి రాజకీయ నేతల అండతో పాటూ పోలీసు ఉన్నతాధికారులు కూడా అతనికి సహకరించేవారట. ఫేస్ బుక్ లో కూడా విక్కీ చాలా యాక్టివ్ గా ఉండేవాడు. అతనిపై పోలీసు కేసులు నమోదైనప్పుడల్లా, ఫేస్ బుక్ ద్వారానే వాటిని ఖండించేవాడు. జైలు శిక్షను అనుభవిస్తున్న సమయంలో కూడా అతడు ఫేస్ బుక్ వాడేవాడట. నభా జైలుపై దాడి జరిపి విక్నీని విడిపించుకుపోయారు.

విక్కీ డిస్కస్ త్రోలో నేషనల్ లెవెల్ ఆటగాడు. నేషనల్ లెవల్ లో మూడు గోల్డ్ మెడల్స్.. రెండు సిల్వర్ మెడల్స్ సంపాదించాడు. స్కూలింగ్ టైమ్ లో విక్కీని చూసి అతడి కోచ్ లు ఎంతగానో గర్వపడేవారు. కానీ అతడు మరీ నరరూప రాక్షసుడిగా మారుతాడని ఎవరూ ఊహించలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here