క‌న్న‌త‌ల్లిని, తోడ‌బుట్టిన చెల్లినీ ఇంట్లో ఉంచి తాళం వేశాడు..!

మండ్య: క‌న్నత‌ల్లిని, తోడ‌బుట్టిన చెల్లినీ ఇంట్లో ఉంచి తాళం వేశాడో వ్య‌క్తి. దీనికి కార‌ణం- ఆస్తి. ఆస్తి కోసం అత‌నీ ఘాతుకానికి పాల్ప‌డ్డాడు. కొన్ని నెల‌లుగా ఆ ఇద్ద‌రికీ ఆ ఇల్లే లోకమైంది. క‌ర్ణాట‌క‌లోని మండ్య న‌గ‌రం హౌసింగ్‌బోర్డు కాల‌నీలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

కుమారుడి చేతిలో బందీలైన ఆ త‌ల్లి పేరు సునంద‌మ్మ‌, చెల్లి పేరు ర‌మ్య‌. కుమారుడు నాగ‌రాజు, సునంద‌మ్మ‌, ర‌మ్య మ‌ధ్య కొంత‌కాలంగా ఆస్తి వివాదాలు న‌డుస్తున్నాయి.

నాగ‌రాజు తండ్రి చెన్నే గౌడ ప్ర‌భుత్వ ఉద్యోగిగా ప‌ద‌వీ విర‌మ‌ణ చేశాడు. మండ్య న‌గ‌రంలో, న‌గ‌ర శివార్లో చెన్నేగౌడ, సునంద‌మ్మ పేర్ల మీద భారీగా ఆస్తిపాస్తులు ఉన్నాయి.

చెన్నేగౌడ‌ గ‌త ఏడాది మ‌ర‌ణించాడు. అప్ప‌టి నుంచి నాగ‌రాజు క‌న్ను ఆస్తి మీద ప‌డింది. త‌ల్లికి, చెల్లికి ఎక్క‌డ వాటా ఇవ్వాల్సి వస్తుందోన‌నే ఉద్దేశంతో త‌ర‌చూ వారితో ఘ‌ర్ష‌ణ ప‌డేవాడు.

ఆ ఆస్తిని త‌న పేరు మీద బ‌ద‌లాయించాలంటూ రోజూ ఘ‌ర్ష‌ణ ప‌డుతుండేవాడు. దీనికి నాగ‌రాజు భార్య గీత కూడా స‌హ‌క‌రిస్తుండేది. వారం కింద‌ట ఇలాగే ఘ‌ర్ష‌ణ ప‌డ‌టంతో త‌ల్లి, చెల్లిని హౌసింగ్‌బోర్డులో ఉన్న ఇంట్లో బంధించాడు.

బ‌య‌టి నుంచి తాళం వేసి, తాను ఇంకో ఇంటికి వెళ్లిపోయాడు. అప్ప‌టి నుంచీ సునంద‌మ్మ‌, ర‌మ్య‌ల‌కు ఆ ఇల్లే లోక‌మైంది. ఇంట్లో నిత్యావ‌స‌ర స‌రుకులు ఉండ‌టంతో త‌ల్లీకుమార్తెలు భోజ‌నం వండుకుని తినేవారు. అవి అయిపోయిన‌ప్ప‌టికీ.. నాగ‌రాజు ఏ మాత్రం ప‌ట్టించుకోలేదు.

ఆదివారం ఉద‌యం సునంద‌మ్మ‌, ర‌మ్య పెద్ద ఎత్తున కేక‌లు వేస్తుండ‌టాన్ని గ‌మ‌నించిన స్థానికులు ఆ ఇంటి ముందుకు చేరుకున్నారు. తాళం ప‌గుల‌గొట్టి వారిని విడిపించారు. ఈ ఘ‌ట‌న‌పై మండ్య పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here