బావిలో మూడు మృత‌దేహాలు..ఒకే కుటుంబానికి చెందిన‌వే!

తెలంగాణ‌లోని వ‌న‌ప‌ర్తి జిల్లాలో విషాద‌క‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. జిల్లాలోని వీప‌న‌గండ్ల మండలం గోపాలదిన్నె గ్రామానికి చెందిన రోజా అనే మ‌హిళ త‌న ఇద్ద‌రు కుమార్తెల‌ను బావిలోకి తోసి చంపేసింది.

అనంత‌రం తానూ అదే బావిలోకి దూకి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. దీనికి గ‌ల కార‌ణాలు ఇంకా తెలియ‌రాలేదు. ఈ ఘటనలో రోజా కుమార్తెలు కూతుళ్లు ఎనిమిదేళ్ల వంద‌న‌, అయిదేళ్ల లాస్య మరణించారు. రోజా కూడా మ‌ర‌ణించింది.

ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో.. రోజా త‌న ఇద్ద‌రు కుమార్తెల‌ను తీసుకుని వ్య‌వ‌సాయ బావి వ‌ద్ద‌కు వెళ్లి ఈ దారుణానికి పాల్ప‌డింది. స్థానికులు ఇచ్చిన స‌మాచారాన్ని అందుకుని సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here