పోస్టుమార్టం అయిన 5రోజుల తర్వాత కూడా బిడ్డను తనవద్దే పెట్టుకున్న తల్లి.. తెలిస్తే కన్నీరు పెట్టుకుంటారు..!

ఓ తల్లికి బిడ్డను కోల్పోవడం అన్నది చాలా బాధాకరమైన విషయం. ఆ తల్లి పోగొట్టుకున్న బిడ్డను తలచుకొని ఎన్నాళ్ళైనా అలా బ్రతికేస్తూ ఉంటుంది. ఓ తల్లి మాత్రం తన బిడ్డ జ్ఞాపకాలను పదిలంగా దాచుకోవాలని అనుకుంది. అందుకోసమే ఓ ఫోటో షూట్ నిర్వహించింది. అది కూడా బిడ్డ చనిపోయిన తర్వాత..! పోస్టుమార్టం నిర్వహించిన అయిదు రోజుల తర్వాత కూడా బిడ్డను తన వద్దనే పెట్టుకుంది. 2015లో చోటుచేసుకున్న ఈ ఘటన ఇటీవలే బయటకు వచ్చింది.

సౌత్ డొకోటా లోని రాపిడ్ సిటీకి చెందిన లారెన్ కు అడిలైన్ అనే అమ్మాయి పుట్టింది. ఆ బిడ్డ పుట్టిన కొద్దిరోజులకు చనిపోయింది. అప్పుడు లారెన్ బాధ ఎవరికీ చెప్పుకోలేదు. తనలోనే దాచుకుంది. బిడ్డకు పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత కూడా ఆ బిడ్డకు అంత్యక్రియలు నిర్వహించలేదు. దాదాపు అయిదు రోజుల పాటూ తన వద్దనే పెట్టుకుంది. అలాగే ఆ బిడ్డతో ఫోటో షూట్ నిర్వహించింది.

ఈ విషయం బయటకు రావడంతో పలువురు పలు విధాలుగా కామెంట్లు చేస్తూ ఉన్నారు. కానీ తాను చేసిన పనిని లారెన్ మాత్రం సమర్థించుకుంటూ ఉంది. తన బిడ్డను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకోవాలని అనుకున్నానని.. ఎంతో భవిష్యత్తు ఊహించుకున్నానని చెప్పుకొచ్చింది. అలాంటిది తన బిడ్డ చావుతో అన్నీ దూరమయ్యాయని చెప్పుకొచ్చింది. అందుకే తాను తన బిడ్డ చనిపోయాక కూడా ఫోటో షూట్ నిర్వహించానని చెప్పింది. మరో ఏడాదికి లారెన్ కు మళ్ళీ అమ్మాయే పుట్టింది. ఇప్పుడు లారెన్ ఎంతో సంతోషంగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here