ఎస్ఐ చెల్లెలితో ప్రేమ‌! త‌ల్లితో అత‌ని ఇంటికి! త‌ల్లితో క‌లిసి మూడో అంత‌స్తు నుంచి దూకి మృతి!

బెంగ‌ళూరు: అపార్ట్‌మెంట్ మూడో అంత‌స్తు నుంచి త‌ల్లీ, కుమారుడు కిందికి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఉదంతం బెంగ‌ళూరు శివార్ల‌లోని కాడుగోడిలో చోటు చేసుకుంది. మృతుల‌ను సుంద‌ర‌మ్మ‌, ఆమె కుమారుడు మౌనేష్‌గా గుర్తించారు.

మౌనేష్ క‌ర్ణాట‌క ఆర్టీసీలో బ‌స్‌డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. వారి స్వ‌స్థ‌లం యాద్గిర్‌. నాలుగు రోజుల కింద‌టే వారు కాడుగోడులోని ఫ్లాట్‌కు వ‌చ్చారు. ఆ ఫ్లాట్‌లో కాడుగోడి పోలీస్‌స్టేష‌న్ ఇన్‌స్పెక్ట‌ర్ చంద్ర‌ప్ప నివ‌సిస్తున్నారు.

ఇన్‌స్పెక్ట‌ర్ చంద్ర‌ప్ప చెల్లెలిని మౌనేష్ ప్రేమిస్తున్నాడ‌ని చెబుతున్నారు. ఈ ప్రేమ వ్య‌వ‌హారం కార‌ణంగా మౌనేష్ ఇదివ‌ర‌కే చంద్ర‌ప్ప రెండు, మూడు సార్లు వ‌చ్చాడ‌ని స్థానికులు చెబుతున్నారు. త‌న చెల్లెలిని ప్రేమిస్తున్నందున చంద్ర‌ప్ప ప‌లుమార్లు మౌనేష్‌ను హెచ్చ‌రించాడ‌ట‌. దీనితో కొద్దిరోజుల కింద‌ట చంద్ర‌ప్ప చెల్లెలు మౌనేష్‌తో పాటు వెళ్లిపోయింద‌ని అంటున్నారు.

ఆ త‌రువాత‌- మౌనేష్ త‌ల్లి సుంద‌ర‌మ్మ త‌న కుమారుడిని వెంట‌బెట్టుకుని చంద్ర‌ప్ప‌తో మాట్లాడ‌టానికంటూ అత‌ని ఫ్లాట్‌కు వెళ్లింద‌ని, ఆ త‌రువాత వారు మూడో అంత‌స్తు నుంచి కిందికి దూకి మ‌ర‌ణించార‌ని తేలింది.

దీన్ని ఆత్మ‌హ‌త్య‌గా కాకుండా, అనుమానాస్ప‌ద మృతి కింద కేసు న‌మోదు చేశారు పోలీసులు. చంద్ర‌ప్ప‌ను అదుపులోకి తీసుకున్నారు. కాడుగోడి పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here