తెలుగుత‌ల్లి ఫ్లైఓవ‌ర్ ఎక్కారు.. స‌ర్రుమంటూ జారిప‌డ్డారు! ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు!

హైద‌రాబాద్‌: ఇందిరా పార్క్ మీదుగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ను, ఇటు ల‌క్డీకాపుల్‌ను అనుసంధానం చేసే తెలుగుత‌ల్లి ఫ్లైఓవ‌ర్ ఎప్పుడూ ర‌ద్దీగానే ఉంటుంది. వంద‌ల సంఖ్య‌లో వాహ‌నాలు ఈ ఫ్లైఓవ‌ర్ మీదుగా రాక‌పోక‌లు సాగిస్తుంటాయి. శుక్ర‌వారం ఉద‌యం తెలుగుత‌ల్లి ఫ్లైఓవ‌ర్ ఎక్కిన వాహ‌న‌దారులు స‌ర్రు స‌ర్రుమంటూ జారిప‌డ్డారు. ఒక‌రు కాదు, ఇద్ద‌రు కాదు ప‌దుల సంఖ్య‌లో వాహ‌న‌దారులు జారిప‌డ్డారు.

దీనికి కార‌ణం.. ఫ్లైఓవ‌ర్‌పై ఆయిల్ ప‌డ‌ట‌మే. తెల్ల‌వారు జామున ఫ్లైఓవ‌ర్ మీదుగా వెళ్లిన ఓ ట్యాంకర్ నుంచి ఆయిల్ లీకైంది. ఫ‌లితంగా.. దాన్ని పెద్ద‌గా గ‌మ‌నించ‌ని వాహ‌న‌దారులు జారిప‌డ్డారు. ఈ స‌మాచారం అందుకున్న వెంట‌నే న‌గ‌ర పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఆయిల్ ప‌డిన చోట ఇసుక చ‌ల్లారు. వాహ‌నాల రాక‌పోక‌ల‌కు ఆటంకం క‌ల‌గ‌కుండా చేశారు.  ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. ఇసుక‌ను చ‌ల్లుతున్న వీడియోను పోస్ట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here