ఈ మౌల్వీ మొబైల్ నిండా అమ్మాయిల ఫొటోలు..!

ఈ ఫొటోలో క‌నిపిస్తోన్న వ్య‌క్తి ఓ మౌల్వీ. క‌ర్ణాట‌క హ‌వేరి జిల్లాలోని బ్యాడ‌గిలో నివాసం ఉంటున్నాడు. అత‌ని పేరు మ‌హ‌మ్మ‌ద్ షెహ‌జ్‌మ‌ల్‌. ప‌శ్చిమబెంగాల్‌లోని ఇస్లాంపూర్‌కు చెందిన మ‌హ‌మ్మ‌ద్ రెండేళ్ల కింద‌ట బ్యాడ‌గికి వ‌చ్చాడు.

అక్క‌డే నివాసం ఉంటున్నాడు. మౌల్వీ, ఇస్లాం బోధ‌కుడిగా ఉంటున్నాడు. ద‌ర్గా, మ‌సీదుకు వ‌చ్చే అమ్మాయిల ఫొటోల‌ను వివిధ కోణాల్లో, అశ్లీలంగా తీయ‌డం అత‌ని ప్ర‌వృత్తి.

ఆదివారం ఓ యువ‌తి ద‌ర్గాకు రాగా.. ఆమె ఫొటోలను తీశాడు. దీన్ని గ‌మ‌నించిన ఆ యువ‌తి అత‌ణ్ణి నిల‌దీయ‌గా..మొద‌ట గ‌ద‌మాయించాడు. ఆ త‌రువాత నీళ్లు న‌మిలాడు.

మొబైల్‌లో చూడ‌గా.. ప‌లువురు యువ‌తుల ఫొటోలు అత‌ని మొబైల్‌లో క‌న‌పించాయి. వెంట‌నే బాధిత యువ‌తి ఈ విష‌యంపై బ్యాడ‌గి పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేర‌కు పోలీసులు మ‌హ‌మ్మ‌ద్‌ను అరెస్టు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here