శ్రీ‌రెడ్డి వ్య‌వహారంలో మెట్టు దిగిన `మా`

హైద‌రాబాద్‌: టాలీవుడ్‌లో సంచ‌ల‌నాల‌కు కేంద్రబిందువుగా మారిన శ్రీ‌రెడ్డి వ్య‌వ‌హారంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ మెట్టు దిగింది. ఆమెపై విధించిన నిషేధాన్ని ఎత్తేయాల‌ని నిర్ణ‌యించుకుంది. దీన్ని అధికారికంగా ఇంకా ప్ర‌క‌టించాల్సి ఉంది.

 

టాలీవుడ్‌లో త‌న‌కు అన్యాయం జ‌రిగిందంటూ ఇటీవ‌లే శ్రీ‌రెడ్డి అర్ధ‌న‌గ్నంగా `మా` కార్యాల‌యం ముందు బైఠాయించిన విష‌యం తెలిసిందే. ఈ వ్య‌వ‌హారాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణించిన `మా` ప్ర‌తినిధులు.. ఆమెపై నిషేధం విధించారు. స‌భ్య‌త్వ ఇవ్వ‌బోమ‌ని ప్ర‌క‌టించారు.

శ్రీ‌రెడ్డికి అవ‌కాశం ఇచ్చిన వారిని, ఆమెతో క‌లిసి న‌టించిన వారిని కూడా `మా` నుంచి బ‌హిష్క‌రిస్తామ‌ని హెచ్చ‌రించారు. ఈ విష‌యంలో అసోసియేష‌న్ ముప్పేట దాడిని ఎదుర్కొంది.

కొంద‌రు సినీ ప్ర‌ముఖుల‌తో పాటు స్వ‌చ్ఛంద సంస్థ‌ల ప్ర‌తినిధులు మా తీరును ఎండ‌గ‌ట్టారు. దీనితో మా ప్ర‌తినిధులు కాస్త మెత్త‌బ‌డ్డారు. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. `మా` స‌భ్యుల‌తో శ్రీ‌రెడ్డి న‌టించ‌వ‌చ్చ‌ని అన్నారు. మా స‌భ్యులు కూడా ఆమెతో క‌లిసి న‌టించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

శ్రీరెడ్డి చేసిన పనికి మనస్తాపం చెంది, ఆమెపై చ‌ర్య‌లు తీసుకున్నామే త‌ప్ప‌, క‌క్ష పూరితంగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని అన్నారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు శివాజీ రాజా వెల్లడించారు. శ్రీరెడ్డి కూడా ‘మా’ కుటుంబంలో సభ్యురాలే అని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here