‘మా’ సభ్యులెవరు శ్రీ రెడ్డితో కలిసి నటించరు.. ఒక వేళ నటిస్తే వారిని కూడా సస్పెండ్‌ చేస్తాం..!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)లో సభ్యత్వం ఇవ్వకుండా తనను అడ్డుకుంటూ ఉన్నారని శ్రీరెడ్డి చాలా రోజులుగా పోరాటం చేస్తూ ఉంది.. ఈ శనివారం నాడు ఏకంగా బట్టలు విప్పేసి కూర్చోవడం వివాదాస్పదం అయింది. తాను మూడు సినిమాల్లో నటించానని అయినా కూడా నాకు ఎందుకు ఇవ్వడం లేదు కార్డు అని ప్రశ్నిస్తోంది. అందుకనే తాను నగ్నంగా ప్రొటెస్ట్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది. దీంతో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఫైర్ అయింది. ఆమెకు ‘మా’ లో సభ్యత్వం ఇవ్వమని చెప్పింది.

శనివారం జరిగిన సంఘటనపై మీడియా సమావేశం నిర్వహించిన మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ సభ్యులు ఎట్టి పరిస్థితుల్లో శ్రీరెడ్డికి సభ్యత్వం ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఇలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమన్నారు. అలాగే మాలో ఉన్న 900 మంది శ్రీరెడ్డితో పని చేయమని చెప్పేశారు.

మా అధ్యక్షుడు శివాజీ రాజా.. వివాదం చేస్తే కార్డ్ వస్తుందని భావించటం తప్పన్నారు. ఇప్పటికే శ్రీరెడ్డిని మా అసోషియేషన్‌లోకి ఆహ్వానిస్తూ అప్లికేషన్‌ ఫాం ఇచ్చాం. కానీ ఆమె పూర్తి వివరాలు ఇవ్వలేదు. పైగా మా సభ్యులపై ఆరోపణలు చేస్తోంది. ఇది సరికాదు. శ్రీరెడ్డిపై లీగల్‌ చర్యలు తీసుకుంటామాని తెలిపారు. శ్రీరెడ్డి అప్లికేషన్‌ను తిరస్కరిస్తున్నాం. మా సభ్యులెవరు ఆమెతో కలిసి నటించరు. ఒక వేళ నటిస్తే వారిని కూడా సస్పెండ్‌ చేస్తామని మా సభ్యులు వెల్లడించారు. మా అసోషియేషన్‌కు తెలంగాణ ఫిలిం చాంబర్ కూడా మద్ధతు తెలిపింది. బ్లాక్ మెయిల్ రాజకీయాలను చేస్తే సహించమని చెప్పారు.

 

డైరెక్టర్ తేజ గారు రెండు సినిమాలలో ఛాన్స్ ఆమెకు ఇచ్చారని.. 50వేల రూపాయలు ఇప్పటికే అడ్వాన్స్ కూడా ఇచ్చామని చెప్పారు. ఆమె సినిమాల్లో నటించాలి అని అనుకుంటే.. నటించవచ్చు అని.. కానీ ఛీప్ పబ్లిసిటీ కోసం ఇలాంటి పనులు చేస్తోందని అన్నారు. తేజతో కూడా మాట్లాడుతామని.. ఆమెకు ఎట్టి పరిస్థితుల్లో ఆమెకు అవకాశం ఇవ్వమని చెప్పుకొచ్చారు. ఆ అమ్మాయితో యాక్ట్ చేసే ప్రసక్తే లేదని చెప్పారు. కార్డు అసలు ఇవ్వడం జరగదని చెప్పుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here