ఆడిషన్స్ కు లోపలికి రమ్మన్నాడు.. షర్ట్ విప్పి చూపించమన్నాడు..!

క్యాస్టింగ్ కౌచ్.. ఈ మధ్య మన వద్ద కూడా బాగా చర్చనీయాంశమవుతోంది.. సినిమాల్లో అవకాశాలు ఇస్తామని పలువురు వేధింపులకు గురవుతూ ఉన్నారు. అలా వేధింపులకు గురైన వాళ్ళు.. తమకు జరిగిన సంఘటనలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తున్నారు.. అంతేకాకుండా బయటపెడుతూ ఉన్నారు. హాలీవుడ్ లో అయితే ముఖ్యంగా పలు క్యారెక్టర్లకు సెలెక్ట్ చేసుకునే క్యాస్టింగ్ డైరెక్టర్లు ఎక్కువగా వేధిస్తూ ఉంటారన్న విషయం తెలిసిందే.. అలా తనకు ఎదురైన ఓ సంఘటనను హాలీవుడ్ సింగర్ కమ్ యాక్టర్ అయిన జెన్నిఫర్ లోపెజ్ బయటపెట్టింది. తనకు కూడా వేధింపులు ఎదురైన సంగతిని దాదాపు మూడు దశాబ్దాల తర్వాత బయటపెట్టింది.

లోపెజ్ హాలీవుడ్ లో అడుగుపెట్టిన తొలినాళ్లలో ఎదురైన అనుభవాన్ని పంచుకుంది. దానిపై ఆమె మాట్లాడుతూ, ‘‘ఆ రోజు ఆడిషన్‌ కు నేను ఒక్కదాన్నే వెళ్లాను. ఆడిషన్‌ చేసిన క్యాస్టింగ్ డైరెక్టర్ నన్ను షర్ట్‌ విప్పమని, హాఫ్‌ న్యూడ్‌ గా కనిపించమని అడిగాడు. నేనప్పుడు గట్టిగా నో చెప్పడానికి కూడా ఎలా భయపడ్డానో ఆలోచిస్తే ఈరోజుకీ భయమేస్తుంది. ఆ సమయంలో తన గుండె గట్టిగా కొట్టుకొంది.. ఈ వ్యక్తి నాకు మొదటి సినిమాలో అవకాశం ఇవ్వబోతున్నాడు.. అతడు చెప్పింది చేద్దామా అని అనుకుంటుండగా.. తన మనసు మాత్రం చేయకూడదనే దానికే ఫిక్స్ అయిపోయింది.. వెంటనే అతడికి నో చెప్పి బయటకు వచ్చేశా.. నాకే ఈ విషయం బయటపెట్టేందుకు ఇన్నేళ్లు పట్టిందంటే…ఇక సాధారణ యువతుల సంగతి తల్చుకుంటే భయమేస్తోంది. హాలీవుడ్ ఇప్పటికైనా మారాలి’’ అని చెప్పింది. అయితే ఆ వ్యక్తి పేరు.. సినిమా పేరు మాత్రం జెన్నిఫర్ లోపెజ్ బయటపెట్టలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here