ఇది ప్రాథమిక నివేదిక మాత్రమే.. శ్రీదేవికి మందు తాగే అలవాటు లేదన్న అమర్‌ సింగ్‌..!

శ్రీదేవి శనివారం రాత్రి మరణిస్తే సోమవారం రాత్రికి కూడా భౌతికకాయం ముంబైకి చేరుకోకపోవడంపై ఆమె అభిమానులు, ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదట హార్ట్ అటాక్ అన్నారు.. ఇప్పుడేమో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోవడం వలన చనిపోయారని దుబాయ్ వైద్యులు చెబుతున్నారు. అందుకోసమే ఆమె భౌతికకాయం భారత్ కు రావడం ఆలస్యమవుతోంది. అంతే కాకుండా ఆమె శరీరంలో ఆల్కహాల్ కూడా ఉందని వైద్యులు తెలిపారు. అంతేకాకుండా అనుమానాలు కూడా ఉన్నాయని చెప్పడంతో శ్రీదేవి మరణం వెనుక ఏమైనా రహస్యాలు దాగి ఉన్నాయా అన్న అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నాయి. శ్రీదేవి మృతిపై దుబాయ్ వైద్యులు ప్రాథమిక నివేదిక మాత్రమే ఇచ్చారని భారత పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి.

శ్రీదేవి మృతిపై రాజ్యసభ ఎంపీ అమర్‌ సింగ్‌ స్పందించారు. శ్రీదేవి భౌతిక కాయం భారత్ కు తరలించే విషయమై దుబాయ్ షేక్ అల్ నహ్యాన్ తో తాను మాట్లాడానని, ఫార్మాలిటీస్ త్వరగా పూర్తి చేస్తామని చెప్పారని, ఈ అర్ధరాత్రికి ఆమె భౌతికకాయం ఇక్కడికి చేరుకునే అవకాశాలు ఉన్నట్టు చెప్పారు. అసలు ఆమెకు మద్యం సేవించే అలవాటే లేదని ఆయన తెలిపారు. అలాంటప్పుడు శ్రీదేవి రక్త నమునాల్లో మద్యం అవశేషాలు ఎలా ఉంటాయని ఆయన ప్రశ్నించారు. శ్రీదేవి మృతిపై లోతైన విచారణ చేపట్టాలని అమర్ సింగ్ అన్నారు. కొన్ని సందర్భాల్లో ఆమె వైన్‌ మాత్రం తీసుకునేవారని ఆయన తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here