ధోని నోట ఐపీఎల్ రిటైర్మెంట్ మాట..!

మహేంద్ర సింగ్ ధోనికి ఇదే ఆఖరి ఐపీఎల్ కాబోతోందా..? మహీ వ్యాఖ్యలు వింటుంటే అలాగే అనిపిస్తోంది. ఐపీఎల్ లోని సక్సెస్ ఫుల్ జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఒకటి. ఐపీఎల్ మొదలైన 2008 నుండి ఎం.ఎస్.ధోని నే ఆ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. రెండేళ్ళు ఫిక్సింగ్ నుండి బ్యాన్ పడ్డాక కూడా వచ్చిన చెన్నై జట్టు ఈ ఏడాది టాప్-2లో నిలిచింది. అయితే అప్పుడే మహీ రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు.

ఇటీవల మీడియాతో మాట్లాడుతూ చెన్నై జట్టు తరుపున చాలా మంది ఆటగాళ్ళు రాబోయే రెండేళ్ళలో రిటర్మెంట్ కాబోతున్నారని చెప్పాడు. సీఎస్కే తో గత పదేళ్ల ఐపీఎల్ ప్రయాణం మధురానుభూతులను మిగిల్చిందనే భావిస్తున్నానని చెప్పాడు. చెన్నై జట్టు యాజమాన్యం ఎంతో తెలివైనదని, వారు ఆటగాళ్ల మనసులకు దగ్గరయ్యారని వ్యాఖ్యానించాడు. వారు ప్రతి సంవత్సరమూ కొత్త ఆటగాళ్లను తీసుకొస్తూనే ఉన్నారని చెప్పాడు. మేనేజ్మెంట్ ఆటగాళ్లకు బాగా దగ్గరైందని.. వారికి గేమ్ మీద మంచి కమాండ్ ఉందని.. అందువలనే మా జట్టు ఇన్ని విజయాలు సాధించడానికి కారణం అయిందని చెప్పుకొచ్చాడు. వచ్చే రెండేళ్ళ తర్వాత ఏమి జరగబోతోందో అన్నదే చాలా ముఖ్యమని.. ఎందుకంటే తమలో చాలా మంది ఉండరని చెప్పేశాడు. గత పదేళ్ళ గురించి మాట్లాడుకుంటే.. తమకు చాలా బాగా నచ్చిందని చెప్పాడు ధోని. వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడిన తర్వాతనే వన్డే ప్రపంచకప్ ఉంది.. అదే తనకి చివరి వరల్డ్ కప్ అని గతంలోనే తేల్చేశాడు. ఇప్పటికే ధోని టెస్టులకు రిటైర్ అయిన సంగతి తెలిసిందే..!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here