అప్పుడే బాదడం మొదలుపెట్టిన ధోని..!

మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్ 11వ సీజన్ మొదలవబోతున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే పలువురు క్రికెటర్లు తమ ఫ్రాంచైజ్ లతో కలిసిపోయారు. ప్రాక్టీస్ లు, అడ్వర్టైజ్మెంట్ల కోసం షూటింగ్ లు మొదలుపెట్టేశారు. చాలా జట్లు సీరియస్ గా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాయి. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని అదే పనిలో ఉన్నాడు. నెట్స్ లో చెమటోడుస్తూ కష్టపడుతూ ఉన్నాడు. ధోని ప్రాక్టీస్ కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. అందులో ధోనీ ఓ బంతిని బలంగా బాదేశాడు. ఆ వీడియోలు మీకోసం..

https://twitter.com/ChennaiIPL/status/976825462126194688

బెట్టింగ్ ఆరోపణలతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రెండేళ్ళు ఐపీఎల్ కు దూరమైన సంగతి తెలిసిందే.. ఇప్పుడు చెన్నై మరోసారి మూడో టైటిల్ వేటలో పడింది. ఇక చెన్నైతో పాటూ ఈ ఏడాది రాజస్థాన్ కూడా ఐపీఎల్ లో ప్రవేశిస్తోంది. రాజస్థాన్ రాయల్స్ తొలి ఐపీఎల్ సీజన్ టైటిల్ గెలిచిన తర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ ఏడాది ఐపీఎల్ లో ఎలా ఆడుతాయో వేచి చూడాలి. ఏప్రిల్ 7న ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్‌తో ప్రారంభంకానున్న ఐపీఎల్ 2018 సీజన్.. మే 27న ఫైనల్‌తో ముగియనుంది. గత కొంతకాలంగా ఐపీఎల్‌లో డీఆర్‌ఎస్ ఉండాలంటూ ఆటగాళ్లతో పాటు మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఒక జట్టుకి ఒకసారి మాత్రమే సమీక్షని వినియోగించుకునే వెసులుబాటు ఉండగా.. ఐపీఎల్‌లోనూ ఇదే తరహా సౌలభ్యాన్ని జట్లకి కల్పిస్తున్నట్లు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here