కెప్టెన్ కూల్ కు కోపం వచ్చింది..!

కోల్ కతా నైట్ రైడర్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో చెన్నై జట్టుపై నైట్ రైడర్స్ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చెన్నై కి అవకాశం ఇవ్వకుండా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. కోల్ కతా కెప్టెన్ దినేష్ కార్తీక్ 18 బంతుల్లో 45 పరుగులతో నాటౌట్ గా నిలిచి అసలు టెన్షన్ అనేదే లేకుండా చేశాడు. ఇక అండర్ 19 ఆటగాడు శుభమన్ గిల్ అర్ధ శతకం బాదడం కోల్ కతాకు కలిసొచ్చింది. 177 పరుగుల టార్గెట్ ను ఇంకా 14 బంతులు మిగిలుండగానే ఛేజ్ చేశారు.

ఈ పరాజయం పట్ల చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ అసహనం వ్యక్తం చేశాడు. బౌలింగ్, ఫీల్డింగ్ రంగాల్లో ఆటగాళ్లు విఫలం కావడం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఆటగాళ్లు ఈ ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించాడు. బౌలర్లు సరైన ప్రదర్శన చేయకపోతే, వారిని తరచుగా మార్చాల్సి ఉంటుందని చెప్పాడు. ఎప్పుడు కూడా ఇలా మాట్లాడని ధోని అన్ని మాటలు అనేశాడేంటి అని అనుకుంటున్నారు క్రికెట్ వీక్షకులు. తమ ఆటగాళ్ళలో కమిట్ మెంట్ లోపించింది అని ధోని ఆగ్రహం వ్యక్తం చేశాడు. బౌలర్ కు ఎన్నో సూచనలు ఇస్తామని.. కానీ ఆఖరులో బంతి వేసేది మాత్రం బౌలరే అని.. అది అతడి చేతిలోనే ఉంటుందని చెప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here