తన 11ఏళ్ల కూతురును 70 సార్లు నరికింది.. కోర్టులో ఇలా నవ్వుతూ..!

మనుషులు మరీ ఇంత కఠినాత్ములా అని అనిపించే దృశ్యం ఇది.. ఈ ఫోటోలో నవ్వుతూ కనిపిస్తున్న మహిళ తన 11 ఏళ్ల కూతురును 70 సార్లు నరికింది.. చివర్లో గొడ్డలితో ఆమె తలను ఛిద్రం చేసింది. అయితే ఆమె చేసిన తప్పుకు ఏ మాత్రం బాధపడకపోగా.. పోలీసుల కస్టడీలో ఇలా నవ్వుతూ కనిపించింది.

ఈమె పేరు తహీరా అహ్మద్.. 39 సంవత్సరాల ఈమె తన కూతురిని అతి కిరాతకంగా నరకడమే కాకుండా ఆమెకు నిప్పు పెట్టింది. ఆ తర్వాత తన ఎనిమిదేళ్ళ చిన్న కూతురు హఫ్సాను తీసుకొని వెళ్ళి కార్ పార్కింగ్ లో 17 గంటల పాటూ దాక్కొంది. అమెరికా, ఓక్లహామా లోని టుస్లాలో ఆమెను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి ఆమెను అరెస్ట్ చేయించారు.

ప్రస్తుతం ఆమె పెద్ద కూతురు పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు ఆమెను తీసుకొని వెళుతున్నప్పుడు కూడా ఆమె ఏ మాత్రం బాధపడలేదు. నవ్వుతూనే కనిపించింది. తన కూతురు మీద అతి కిరాతకంగా దాడి చేయడానికి ఇంకా స్పష్టమైన కారణం బయటకు రాలేదు. తన మాట వినలేదన్న కోపంతో ఆమె ఈ పని చేసిందేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here