ఆసుప‌త్రిలో బిగ్ బి..ఆరోగ్య ప‌రిస్థితేమిటంటే!

బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ఆసుప‌త్రిలో చేరారు. తీవ్ర గొంతునొప్పితో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌ను ముంబై లీలావ‌తి ఆసుప‌త్రిలో చేర్చారు.

ఆయ‌న న‌టించిన తాజా చిత్రం `102 నాటౌట్‌` టీజ‌ర్ శుక్ర‌వారం విడుద‌లైంది. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు అమితాబ్‌. సాయంత్రానికి గొంతునొప్పికి గుర‌య్యారు.

అప్ప‌టికప్పుడు మందులు వాడారు. అయిన‌ప్ప‌టికీ త‌గ్గ‌లేదు. స‌మ‌యం గ‌డిచే కొద్దీ గొంతు నొప్పి తీవ్రం కావ‌డంతో.. లీలావ‌తి ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

అమితాబ్ బచ్చన్ ఆస్పత్రిలో చేరారన్న వార్తతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆరోగ్య ప‌రిస్థితిపై ఎలాంటి అనుమానాలు వ‌ద్ద‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here