స్పాట్ ద డిఫ‌రెన్స్‌! ముంబై పోలీసులే దీన్ని పోస్ట్ చేశారంటే..ఏదో ఉన్న‌ట్టే లెక్క‌!

`ఒక్కోసారి మీ చుట్టు పక్కన కనిపించే చిన్న తేడాలు భ‌విష్య‌త్తులో ఘోర ఘ‌ట‌న‌ల‌కు కారణాలవుతాయి. అందుకే అలర్ట్‌గా ఉండండి. బీ కేర్‌ఫుల్‌. డయల్ 100..` అంటూ ముంబై పోలీసులు ట్వీట్ చేసిన ఫొటో ఇది. ముంబై పోలీసులే ఈ ట్వీట్ చేశారంటే ఇందులో ఏదో స్పెషాలిటీ ఉండే ఉంటుంది. ఈ రెండు ఫొల్లో ఉన్న తేడాను కనుక్కోవాలని పోలీసులు ముంబై జ‌నాల‌కు సూచిస్తూ దీన్ని ట్వీట్ చేశారు.

కొన్ని నిమిషాల‌కే జ‌నం దీనిపై ప‌డ్డారు. త‌మ మెద‌ళ్ల‌కు మేత పెట్టారు. ఆ తేడాను గుర్తిస్తూ రీ ట్వీట్ చేశారు. ఇంత‌కీ ఆ తేడా ఏమిటంటే- ఓ ఫొటోలో సూట్‌కేస్ ఉంది. ఇంకో ఫొటోలో లేదు. మ‌న చుట్టు ప‌క్క‌ల ఎవ‌రూ ప‌ట్టించుకోని వ‌స్తువులు, వాహ‌నాలు ఏవైనా ఉంటే 100 నంబ‌ర్‌కు ఫోన్ చేసి, త‌మ‌కు స‌మాచారం ఇవ్వాల‌నేది పోలీసుల ఉద్దేశం. రోజూ న‌డిచే దారిలోనే మ‌న‌కు ఇలాంటి వ‌స్తువులు, వాహ‌నాలు ఉంటే స‌మాచారం ఇవ్వాల‌ని ముంబై పోలీసులు సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here