శ్రీ‌దేవి క‌న్నుమూస్తార‌నే విష‌యం అమితాబ్ బ‌చ్చ‌న్‌ ముందే అంచ‌నా వేశారా? ఆ ట్వీట్‌కు అర్థ‌మేంటి?

ముంబై: శ్రీ‌దేవి ఇక మ‌న మ‌ధ్య ఉండ‌ర‌నే విష‌యం సూప‌ర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌కు ముందే తెలుసా? ఆయ‌న దీన్ని అంచ‌నా వేయ‌గ‌లిగారా? అని ప్ర‌శ్నిస్తే.. అవున‌నే స‌మాధానే ఇచ్చుకోవాల్సి ఉంటుంది.

 

ఎందుకంటే.. శ్రీ‌దేవి క‌న్నుమూయ‌డానికి కొన్ని గంట‌ల‌ ముందే.. అమితాబ్ బ‌చ్చ‌న్ ఓ ట్వీట్ చేశారు. `న జానే క్యూ..ఏక్ అజీబ్ సీ ఘ‌బ‌రాహ‌ట్ హో ర‌హీ హై..` తెలుగులో చెప్పుకోవాలంటే `ఎందుకు తెలియ‌దు.. గ‌భ‌రాగా ఉంది..` ఇదీ ఆ ట్వీట్ సారాంశం.

శ‌నివారం ఉద‌యం 11:45 నిమిషాల‌కు అమితాబ్ బ‌చ్చ‌న్ ఈ ట్వీట్ చేశారు. గ‌తంలో ఎప్పుడూ ఆయ‌న ఈ త‌ర‌హా ట్వీట్ చేయ‌లేదు. ఉన్న‌ట్టుండి.. ఆయ‌న ఇలా కామెంట్ చేయ‌డం ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

ఏదో జ‌ర‌గ‌బోతోంద‌ని ఆయ‌న మ‌న‌స్సు కీడును శంకించి ఉంటుంది. `ఇదీ..` అని స్ప‌ష్టంగా చెప్ప‌లేని ఓ భ‌యాన్ని అమితాబ్ బ‌చ్చ‌న్ అనుభ‌వించారు.

ఆ ట్వీట్ చేసిన కొన్ని గంట‌ల త‌రువాత.. స‌రిగ్గా చెప్పాలంటే 12 గంట‌ల త‌రువాత శ్రీ‌దేవి క‌న్నుమూశారు. అమితాబ్ బ‌చ్చ‌న్, శ్రీ‌దేవి ప‌లు హిందీ సినిమాల్లో న‌టించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here