వాళ్ళు ఫోన్ చేయడం.. ఈమె OTP చెప్పడం.. మొత్తం ఎంత కొట్టేశారంటే..!

బ్యాంకు అధికారులు ఎన్నో సార్లు చెబుతూనే ఉంటారు.. ఎప్పుడూ మెసేజీలు పెడుతూనే ఉంటారు. అదేమిటంటే ఎవరికి కూడా వన్ టైమ్ పాస్ వర్డ్(OTP) అసలు చెప్పకండి అని..! అలా చెబితే మీ మొత్తం డబ్బులు నొక్కెసే అవకాశం ఉంటుంది అని..! అయితే ఈ విషయం తెలియని ఓ 40 ఏళ్ల మహిళ అన్యాయంగా తన డబ్బును మొత్తాన్ని పోగొట్టుకుంది. ఒకటి కాదు రెండు సార్లు కాదు ఏకంగా 28 సార్లు ఓటీపీ చెప్పడం ద్వారా మొత్తం 7 లక్షలు నోక్కేసారు.

తాము బ్యాంకు నుండి ఫోన్ చేస్తున్నామని చెప్పి నవీ ముంబై కి చెందిన తస్నీమ్ ముజక్కర్ మోదక్ కు ఫోన్స్ వస్తూ ఉన్నాయి. ఆమెకు మాయ మాటలు చెప్పే వారు. అలా చెప్పి ఆమె నుండి ఓటీపీ నంబర్ ను కనుక్కునే వాళ్ళు.. మే 17న ఆమెకు మొదటిసారి కాల్ వచ్చింది. మేడమ్ మీ అకౌంట్ బ్లాక్ అయింది.. అన్ బ్లాక్ చేస్తాం డెబిట్ కార్డు డీటెయిల్స్ చెప్పండి అని అడిగారు. ఆమె వాళ్ళ మాటలు నమ్మేసి చెప్పేసింది. ఆ తర్వాత ఓటీపీ కూడా చెప్పేసింది. అలా వారం రోజుల వ్యవధిలో 28సార్లు ఓటీపీ చెప్పింది. మొత్తం 6,99,973 రూపాయలు ఆమె అకౌంట్ లో నుండి మాయమయ్యాయి. అవసరం వచ్చి డబ్బులు డ్రా చేద్దామని బ్యాంకుకు వెళ్ళగా.. అకౌంట్ లో డబ్బులే లేవు. దీంతో ఆమె మే 29న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ట్రాన్సాక్షన్లు ముంబై, నోయిడా, గురు గ్రామ్, కోల్ కతా, బెంగళూరు ప్రాంతాల్లో జరిగాయని పోలీసులు తెలిపారు. త్వరలోనే పట్టుకుంటామని ఆమెకు పోలీసులు ధైర్యం చెప్పారు. ఆమెకు ఆన్ లైన్ బ్యాంకింగ్ గురించి అసలు తెలీదట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here