దేవుడుకి కులాన్ని అంటగట్టేవాన్ని కాదు.. టంగ్ స్లిప్ అయిందన్న మురళీ మోహన్..!

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సీనియర్ నటుడు మురళీ మోహన్ గురించి పలు పోస్టులు వెళుస్తూ వస్తున్నాయి. అందుకు ముఖ్య కారణం ఆయన వెంకటేశ్వర స్వామిని ‘వెంకన్న చౌదరీ’ అని సంబోధించడమే..! కర్ణాటక ఎన్నికల్లో రకరకాల మతలబులు చేసినప్పటికీ భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి మెజార్టీ రాకపోవడానికి కారణం మా తిరుమల తిరుపతి వెంకన్న చౌదరి అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై నెటిజన్లు మండిపడ్డారు. పలు ఫేస్ బుక్ పేజీల్లోనూ.. ట్విట్టర్ లోనూ ఆయన్ను తెగ ట్రోల్ చేశారు. అయితే ఆయన దీనిపై ఈరోజు వివరణ ఇచ్చారు.

తాను టంగ్ స్లిప్ అయ్యి అలా అన్నాను తప్పితే దేవుడికి కులాన్ని అంటగట్టే వాడిని కాదని చెప్పుకొచ్చాడు. తాను తిరుపతి ఏడుకొండలవాడి గురించి మాట్లాడుతూ వెంకన్న చౌదరి అని నోరుజారి అన్నానని క్షమాపణలు తెలిపారు. అప్పటివరకూ వేదికపై బుచ్చయ్య చౌదరితో మాట్లాడుతున్న తాను, వెంటనే ప్రసంగానికి పిలవడంతో సభలో మాట్లాడుతూ వెంకన్న చౌదరి అనడం జరిగిందే తప్ప.. ఉద్దేశ పూర్వకంగా వచ్చింది కాదని చెప్పారు. ఏడుకొండల వాడంటే తనకు ఎంతో భక్తిప్రపత్తులు ఉన్నాయంటూ నోరుజారి అన్నమాటకు సోషల్ మీడియా, ఇతర ఛానళ్లలో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. తనకు అన్నికులాలు సమానమేనని, కుల దురభిమానం లేదని అన్నారు. ఏడుకొండలవాడికి కులం ఆపాదించే తెలివితక్కువ వాడిని కానంటూ, పొరపాటున వచ్చిన మాటకు పెద్దమనసుతో క్షమించాలని కోరారు. ఈరోజు ఉదయమే ఏడుకొండలవాడి పూజ సందర్భంగా దీనిపై స్వామివారిని మన్నింపు వేడుకొన్నట్లుగా పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు మురళీ మోహన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here