భర్తను చంపేందుకు బీహార్ నుండి లవర్ ను రప్పించింది.. ఎలా దొరికిపోయిందంటే..!

భర్తను చంపించేందుకు బీహార్ నుండి ప్రియుడిని తీసుకొని వచ్చింది.. అన్నీ అనుకునట్లే జరిగిపోయాయి. అయితే పోస్ట్ మార్టం రిపోర్టులో అడ్డంగా దొరికిపోయారు.. ఆత్మహత్య కాస్తా హత్య అని పోలీసులకు అనుమానం రావడంతో ఇప్పుడు అతడి భార్య కటకటాల పాలైంది. కట్టుకున్న భర్తను చంపించేందుకు బీహార్ నుండి ప్రియుడిని విమానంలో హైదరాబాద్ కు పిలిపించింది మాలతీదేవి అనే గృహిణి.

జై మంగళ్ దాస్ తన భార్య మాలతీదేవితో కలిసి ఎనిమిదేళ్ల క్రితం బీహార్ నుంచి హైదరాబాద్ కు వలస వచ్చారు. ఫతేనగర్ సమీపంలో నివాసం ఉంటున్నారు. వారికి ముగ్గురు పిల్లలు. అప్పుడప్పుడు వీరు సొంత ఊరికి వెళ్లి వస్తుంటారు. ఈసారి వెళ్లినప్పుడు మాత్రం తనకన్నా ఎనిమిదేళ్లు చిన్నవాడైన చెల్లెలి మరిది నీరజ్ కుమార్ తో మాలతీదేవి పరిచయం ఏర్పడింది. అది సంబంధంగా మారింది. విషయం తెలుసుకున్న మంగళ్ దాస్ ఆమెను మందలించడం కూడా జరిగింది.

పద్ధతి మార్చుకోమన్న భర్త మాటలు ఆమెకు నచ్చలేదు. దీంతో అతన్ని హతమార్చాలని భావించింది. లవర్ ను ఇక్కడికి వచ్చేయమని చెప్పింది. నీరజ్ కుమార్ ను గత నెల 31న హైదరాబాద్ కు పిలిపించింది. స్పైస్ జెట్ విమానంలో వచ్చిన నీరజ్, రాత్రి 12 గంటలకు మాలతి ఇంటికి వెళ్ళాడు. మందు తాగి నిద్రలో ఉన్న మంగళ్ దాస్ గొంతుకు తాడు బిగించి హత్య చేశాడు. ఆపై ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఓ లేఖ రాసి అక్కడే పెట్టి, తిరిగి విమానంలో బీహార్ వెళ్లిపోయాడు. సూసైడ్ నోట్ కనిపించడంతో తొలుత ఆత్మహత్యగానే భావించినప్పటికీ, పోస్టుమార్టం నివేదికలో గొంతుకు తాడు బిగించి చంపినట్టు తేలడంతో హత్య కేసు నమోదు చేశారు. ఆయన భార్య మాలతీదేవిని సికింద్రాబాద్ సమీపంలో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ప్రియుడిని పట్టుకోడానికి పోలీసులు బీహార్ వెళ్ళాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here