ముష్ఫికర్ నాగినీ డ్యాన్స్ ఎందుకు చేశాడంటే..!

క్రికెట్ లో పసికూన అయిన బంగ్లాదేశ్ అప్పుడప్పుడూ పెద్ద పెద్ద జట్లకు షాక్ ఇస్తూ ఉంటుంది. వాళ్ళ విజయం ఏమో కానీ మైదానంలో వారు చేసే ఓవర్ యాక్షన్ ను భరించలేరు క్రికెట్ అభిమానులు. ఎందుకు బంగ్లాదేశ్ క్రికెటర్లు, అభిమానులు అంత ఓవర్ చేస్తూ ఉంటారు అని సోషల్ మీడియాలో తెగ రచ్చ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మరోసారి బంగ్లాదేశ్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్ చేసిన నాగిన్ డ్యాన్స్ గురించి క్రికెట్ అభిమానులు మాట్లాడుకుంటూ ఉన్నారు.

215 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని సైతం సునాయాసంగా ఛేదించింది. వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ దెబ్బకు లక్ష్యం చిన్నదైపోయింది. ఫలితంగా మరో రెండు బంతులు మిగిలి ఉండగానే జయకేతనం ఎగురవేసింది. ముష్పికర్ రహీమ్ అయితే శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. 35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 72 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. జట్టుకు అద్భుత విజయాన్ని అందించిన ముష్ఫికర్‌ చేసిన నాగిన్ డ్యాన్స్ గురించి అందరూ చర్చించుకుంటూ ఉన్నారు.

ఈ నాగినీ డ్యాన్స్ వెక్కిరింత మొదట బంగ్లాదేశ్‌లోనే ప్రారంభమైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీలంక జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లినప్పుడు రెండు టీ20ల సిరీస్‌ను లంక 2-0తో కైవసం చేసుకుంది. రెండో టీ 20 లో శ్రీలంక బ్యాట్స్‌మన్ వికెట్ తీసిన ఆనందంలో బంగ్లా స్పిన్నర్ నాగినీ డాన్స్ చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో లంక 75 పరుగుల తేడాతో బంగ్లాపై గెలిచింది. బంగ్లా ఆఖరి వికెట్ తీసిన శ్రీలంక ఆటగాడు గునతిలక కూడా నాగినీ డాన్స్ చేశాడు. బంగ్లా బౌలర్ నాగినీ డాన్స్‌కు గునతిలక బదులిచ్చేశాడు.. కానీ ముష్ఫికర్ మనసులోనే పెట్టుకున్నాడు. అప్పటి గునతిలక నాగినీ డాన్స్‌కు ఇప్పుడు ముష్ఫికర్ మళ్లీ బదులిచ్చాడన్న మాట. సొంతగడ్డపై శ్రీలంక చేతిలో సిరీస్ ఓడిపోయినందుకు ఇప్పుడు లంక గడ్డపై బంగ్లాదేశ్ పగతీర్చుకుని మరోసారి ముష్ఫికర్ నాగినీ డాన్స్ వేసేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here