నమ్మి ముత్తూట్ ఫైనాన్స్ లో నగలు పెడితే ఆ మేనేజర్ చేసిన పని ఇది..!

‘మన ఇంటనే ఉండగ బంగారం.. ఎందుకు నీకా విచారం’ అన్నది ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ వారి నినాదం. అదే నినాదమే.. ముత్తూట్ ఫైనాన్స్ మేనేజర్ కు కూడా బాగా నచ్చినట్లు ఉంది.. అందుకే తన బ్రాంచ్ లో ఉన్న బంగారు నగలతో ఏకంగా బెట్టింగ్ ఆడేశాడు. వినియోగదారులు తాకట్టుపెట్టిన బంగారంతో ఏకంగా బెట్టింగ్ ఆడేశాడు. అంతేకాకుండా బంగారు నగల బదులు గిల్టు నగలు పెట్టాడు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. చిత్తూరు జిల్లా లోని వి.కోట ముత్తూట్‌ ఫైనాన్స్‌ బ్రాంచ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. రెండు కేజీల బంగారాన్ని ఆ బ్రాంచ్ మేనేజర్ మాయం చేశాడు.

వి.కోట ముత్తూట్‌ ఫైనాన్స్‌ బ్రాంచ్ మేనేజర్‌ గా పని చేస్తున్న ప్రకాశ్ క్రికెట్ బెట్టింగ్ ఆడేవాడు. డబ్బులంతా భారీగానే పోగొట్టుకున్నాడు. ఎలాగైనా పోగొట్టుకున్న డబ్బులు సంపాదించాలని వినియోగదారులు తాకట్టు పెట్టిన బంగారాన్ని బెట్టింగ్ లో పెట్టాడు. అది కూడా ఓడిపోవడంతో ఆ నగల స్థానంలో గుట్టుచప్పుడు కాకుండా నకిలీ బంగారు నగలను పెట్టాడు. అయితే ఈ విషయం ఇటీవలే బయటకు వచ్చింది. పరువు పోతుందని భావించి ఆత్మహత్యాయత్నం చేశాడు ప్రకాష్. ప్రస్తుతం పోలీసులు కేసును దర్యాప్తు ప్రారంభించారు. బెట్టింగ్ ఎవరెవరితో ఆడాడు అన్నది విచారిస్తూ ఉన్నారు పోలీసులు. చిత్తూరు జిల్లాలోని బడా బడా వ్యక్తులు ఈ బెట్టింగ్ రాకెట్ వెనుక ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here