`మ‌హాన‌టి`లోని డిలేటెడ్ సీన్స్‌!

తెలుగుతెర ఇల‌వేల్పు సావిత్రి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కించిన చిత్రం `మ‌హాన‌టి`. సూప‌ర్‌హిట్ టాక్‌తో దూసుకెళ్తోందా సినిమా. ఒకే రోజు రెండుసార్లు ఈ మూవీని చూసిన ప్రేక్ష‌కులు చాలా మందే ఉన్నారు. తాజాగా- ఈ సినిమాలో డిలేట్ చేసిన ఒక‌టి, రెండు సీన్లు వెలుగులోకి వ‌చ్చాయి. నిజ జీవితంలో త‌మిళ‌నటుడు జెమినీ గ‌ణేషన్‌కు మూడో భార్య సావిత్రి.

మొద‌టి భార్య అలిమేలు, రెండో భార్య పుష్ప‌వ‌ల్లి. ఈ పుష్ప‌వ‌ల్లి కుమార్తెనే బాలీవుడ్ వెట‌ర‌న్ హీరోయిన్ రేఖ‌. మ‌హాన‌టిలో మొద‌టి భార్య అలిమేలుగా మాళ‌వికా నాయ‌ర్ న‌టించారు. రెండో భార్య పుష్ప‌వ‌ల్లి పాత్ర‌లో బిందు చంద్ర‌మౌళి అనే వ‌ర్ధ‌మాన తెలుగు న‌టి న‌టించారు. పుష్ప‌వ‌ల్లికి సంబంధించిన కొన్ని సీన్ల‌ను చిత్రీక‌రించిన‌ప్ప‌టికీ.. నిడివి ఎక్కువ కావ‌డం వ‌ల్ల వాటిని తొల‌గించార‌ట‌.

దీనికి సంబంధించిన కొన్ని ఫొటోల‌ను బిందు చంద్ర‌మౌళి సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. మ‌హాన‌టిలో తాను న‌టించిన సీన్ల‌ను తొల‌గించ‌డం బాధ క‌లిగించింద‌ని ఆమె చెప్పుకొచ్చారు. త‌న పాత్ర‌ను తొల‌గించిన‌ట్లు తెలిసిన వెంట‌నే గుండె పగిలిన భావన కలిగింద‌ని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here