స్కూల్ గ్రౌండ్‌లో విద్యార్థుల‌కు దొరికిన గుడ్లు: ప‌గుల‌గొట్టి చూసి..పారిపోయారు!

ఈస్ట‌ర్న్ బ్రౌన్ స్నేక్‌. ఈ పేరు వింటే ఆస్ట్ర‌లియ‌న్ల గుండెలు గుభేల్ మంటాయి. విష‌పూరిత‌మైన పాము ఇది. అలాంటి పాము గుడ్లు ఓ పాఠ‌శాల గ్రౌండ్‌లో దొరికాయి.

డ‌జ‌నో, అర‌డ‌జ‌నో కాదు.. ఏకంగా 43 బ్రౌన్ స్నేక్ గుడ్లు పిల్ల‌ల చేతికి చిక్కాయి. అందులో ఒక దాన్ని ప‌గుల‌గొట్టి చూసిన విద్యార్థులు భ‌యంతో వ‌ణికిపోయారు. దూరంగా పారిపోయారు.

ఓ పిల్ల పాము జ‌ర‌జ‌ర‌మంటూ పాక్కుంటూ రావ‌డంతో విద్యార్థులు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. ఈ విష‌యం తెలిసిన వెంట‌నే స్కూల్ యాజమాన్యం స్థానిక వైల్డ్‌లైఫ్‌ సంస్థకు సమాచారం ఇచ్చింది.

ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌వేల్స్‌లో ఓ స్కూల్ గ్రౌండ్‌లో దొరికాయ‌వి. స‌మాచారం అందుకున్న వెంట‌నే వైల్డ్ లైఫ్ సంస్థ ప్ర‌తినిధులు స్కూల్‌కు చేరుకున్నారు. గుడ్ల‌ను స్వాధీనం చేసుకున్నారు.

స్కూలు ఆవ‌ర‌ణ‌లో ఇంత పెద్ద ఎత్తున, అత్యంత విష‌పూరిత‌మైన పాము గుడ్లు దొర‌క‌డంతో అంద‌రూ ఉలిక్కిప‌డ్డారు. ఇవి ఈస్ట‌ర్న్ బ్రౌన్ స్నేక్స్ గుడ్లు కాక‌పోవ‌చ్చ‌ని, ఆ పాములు ఇసుక‌లో గుడ్లు పెట్ట‌వ‌ని ఆస్ట్రేలియ‌న్ రెప్టిల్ పార్క్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ టిమ్ ఫాల్క్‌న‌ర్ చెప్పారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here