ఆయన పర్మిషన్ తీసుకోవాలట.. ఈ పెయింటింగ్ తో ఫోటో దిగేటప్పుడు..!

ప్రపంచంలోని కొన్ని ప్రసిద్ధి పెయింటింగ్స్ లో ఇది కూడా ఒకటి. ఈ పెయింటింగ్ పేరు బెర్నాడో డీ గాల్వేజ్.. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరే ఇది.. అయితే పెయింటింగ్ బాగుంది కదా అని వెళ్ళి ఆ పెయింటింగ్ పక్కనే నిలబడి ఫోటో తీయించుకోకండి. ఒక వేల మీరు ఆ ఫోటో తీసుకుంటే సరిగా రాదట.. ఫోటో బ్లర్ అయిపోవడం జరగచ్చు.. బాగా ఫోటో రావాలంటే కేవలం ఆయన పర్మిషన్ అడిగే ఫోటో తీసుకోవాలి.. అప్పుడు మాత్రమే ఫోటో బాగా వస్తుంది. అందుకు కారణం ఆయన ఆత్మ అని అంటూ ఉంటారు.

ఈ పెయింటింగ్ టెక్సాస్ లోని హోటల్ గాల్వేజ్ లో ఉంటుంది. స్పానిష్ మిలటరీ ఆఫీసర్ అయిన బెర్నార్డో డి గాల్వెజ్ పెయింటింగ్ ను హోటల్ లాబీల్లో ఉంచారు. ఆయన పేరు మీదనే ఈ హోటల్ ను ఏర్పాటు చేశారు. 1900ల్లో ఈ హోటల్ ను తెరచగా.. ఆ హోటల్ కు వచ్చిన వాళ్ళు ఆయన పెయింటింగ్ గురించే ఎక్కువగా మాట్లాడుకునేవాళ్ళు. ఎందుకంటే ఆ పెయింటింగ్ దగ్గర ఏదో తెలియని వైబ్రేషన్స్ ఉండేవని చెప్పే వాళ్ళు..! ఆయన పర్మిషన్ లేకుండా ఫోటో తీసుకుంటే చాలా సార్లు సరిగా వచ్చేది కాదట. ముఖ్యంగా ఆయన కళ్ళు తమను ఫాలో చేస్తున్నాయని అందరూ అనుకునేవాళ్ళు. అంతేకాకుండా ఆ పెయింటింగ్ పక్కన నిలబడ్డప్పుడు చాలా చల్లగానూ, ఒంట్లో నలతగానూ అనిపిస్తూ ఉందని చాలా మంది ఫిర్యాదు చేశారు. ఆయన ఆత్మ ఆ పెయింటింగ్ వద్దనే ఉందని నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here