ఉన్నది ఒకటే ఇండియా.. గుర్తుపెట్టుకోండి..!

అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా ‘నా పేరు సూర్య’ డైలాగ్ ఇంపాక్ట్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి. “సౌత్ ఇండియా.. నార్త్ ఇండియా.. ఈస్ట్.. వెస్ట్.. అన్ని ఇండియాలు లేవురా మ‌న‌కి.. ఒక్క‌టే ఇండియా.” అని..! ఎందుకంటే మనం చాలా రోజులుగా ఇలా సౌత్.. నార్త్.. అని కొట్టుకుంటూ ఉన్నాం..! ఈ విషయాన్ని స్పష్టంగా.. క్లారిటీగా చెప్పాడు ఈ సినిమా డైలాగ్ ఇంపాక్ట్ లో..!

లగడపాటి శ్రీధర్-నాగబాబు-బన్నీ వాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో అను ఇమ్మానియేల్ హీరొయిన్. యాక్షన్ కింగ్ అర్జున్ ఇందులో బన్నీకి హీరోగా నటిస్తున్నారట. పబ్బులో రౌడీ మూకను వాయిస్తూ ఉండగా తన్నులు తిన్నవాడు రేయ్ సౌత్ ఇండియాకా సాలా అంటే దానికి బన్నీ బదులుగా సౌత్ ఇండియా-నార్త్ ఇండియా-ఈస్ట్-వెస్ట్ అన్ని ఇండియాలు లేవురా మనకి ఉన్నది ఒక్కటే ఇండియా అంటూ తనదైన శైలిలో చెప్పి టీజర్ కు ముగింపును ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here