‘క్యారెక్టర్ వదిలేయడమంటే.. ప్రాణాలు వదిలేయడమే..’ దటీజ్ సూర్య..!

‘నా పేరు సూర్య.. నా ఇళ్ళు ఇండియా’ చిత్రానికి ప్రస్తుతం తెలుగు సినీ అభిమానుల్లో భారీగా బజ్ ఉంది. ఇప్పటికే టీజర్లకు మామూలు స్పందన రాలేదు అసలు. ఇప్పుడు ట్రైలర్ తో అల్లు అర్జున్ అభిమానులను ఫిదా చేసేస్తున్నాడు. ఎప్పుడు మే 4 వస్తుందా అని అభిమానులు ఎదురుచూసేలా చేశాడు సూర్య తన ట్రైలర్ ద్వారా..! ఈ చిత్రం ప్రి రిలీజ్ ఈవెంట్‌ను రేపు హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఈ మెగా ఈవెంట్‌కు రామ్ చరణ్ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు.

రైటర్ వక్కంతం వంశీ తొలిసారి డైరక్షన్ చేస్తున్నా కూడా అద్భుతంగా తీర్చి దిద్దినట్లు కనిపిస్తోంది. ఈ సినిమాలో దేశభక్తికి సంబంధించిన అంశాలతో పాటూ.. మాంచి మాస్ ఎలిమెంట్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా సూర్య థియేటర్లలో చితక్కొట్టుడు ఖాయంగానే కనిపిస్తోంది. కె. నాగబాబు సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బన్నీ వాసు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్, శ‌ర‌త్ కుమార్, సాయి కుమార్ ముఖ్య పాత్రల్లో నటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here